33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఇరాన్‌లో హత్యకు గురైన ‘హమాస్’ చీఫ్ ఇస్మాయిల్ హనియే!

టెహ్రాన్‌:  పాలస్తీనా భూభాగమైన గాజాను నడుపుతున్న హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే ఇరాన్‌లో ‘హత్య’కు గురయ్యారని హమాస్ ధృవీకరించింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ బుధవారం ప్రకటించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌ను ఉటంకిస్తూ ఈ కథనం ప్రసారం చేసింది.

కాగా, ఖతార్‌లో నివసిస్తున్న ఇస్మాయిల్‌ హనియే ఇరాన్‌ నూతన అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు టెహ్రాన్‌కు వెళ్లారు. ప్రమాణస్వీకారం పూర్తయ్యాక ఇంటికి చేరుకున్నారు.

టెహ్రాన్‌లోని ఇంటి వద్ద జరిగిన దాడిలో హనియా, ఆయన బాడీగార్డ్ మృతి అమరులయ్యారని” ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌ (IRGC) ఒక ప్రకటనలోపేర్కొంది. అయితే హనియేను ఎవరు హత్య చేశారు..? ఎలా హత్య చేశారు..? వివరాలను ఇరాన్‌ ఇంకా వెల్లడించలేదు. కానీ, హనియే హత్యపై దర్యాప్తు జరుగుతున్నదనే విషయాన్ని మాత్రం ప్రకటించింది.

దాడికి ఎవరూ బాధ్యత వహించనప్పటికీ, ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లోని విశ్లేషకుల ప్రకారం… ఇజ్రాయెల్‌ నిఘా సంస్థనే ఈ హత్య చేయించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇస్మాయిల్‌ హనియేను హతమారుస్తామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు గతంలో ప్రకటించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. హనీయా నివాసంపై జరిగిన ‘వైమానిక దాడి’లో ఆయన చనిపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles