25.2 C
Hyderabad
Monday, September 30, 2024

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు…వందలమంది మృతి, వేయిమందికి గాయాలు!

బీరూట్: లెబనాన్‌లో ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులకు పాల్పడింది. దక్షిణ, తూర్పు లెబనాన్‌లోని నివాస ప్రాంతాలపై పాశవిక దాడుల ఫలితంగా కనీసం 356 మంది మరణించారు. ఇది దశాబ్దంలోనే  అత్యంత రక్తపాతమైన రోజులలో ఒకటిగా నిలిచింది. మరణించిన వారిలో 21 మంది పిల్లలు, 39 మంది మహిళలు ఉన్నారు.  1,024 మందికి పైగా వ్యక్తులు గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రి తెలిపారు.

హిజ్బుల్లా  దక్షిణ కమాండ్ అధిపతి అలీ కరాకిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. అంతేకాదు బీరుట్‌ సహా పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడికి పాల్పడ్డారు. అయితే అలీ కరాకీ ప్రస్తుత స్థితి తెలియదు. బాంబు దాడి వల్ల పదివేల మంది  ఉత్తరం వైపు పారిపోవాల్సి వచ్చింది.  ఇజ్రాయెల్ దళాలు ఫోన్ ద్వారా స్థానికులను సంప్రదించి, తమ ఇళ్లను ఖాళీ చేయమని కోరారు.

ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా, హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్‌లోని సైనిక లక్ష్యాలపై, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని అక్రమ స్థావరాలపై రాకెట్లను ప్రయోగించారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ ప్రాంతంలో “అధికార సమతుల్యతను మార్చడం” లక్ష్యంగా “క్లిష్టమైన” రోజులు రానున్నాయని సూచించారు.

లెబనీస్ భద్రతా వర్గాలు పరిస్థితి మరింత తీవ్రమవుతుందని అంచనా వేస్తున్నాయి. ఇజ్రాయెల్ దక్షిణ నగరాలను లక్ష్యంగా చేసుకున్నందున, అనుమానిత హిజ్బుల్లా సైట్ల సమీపంలోని ప్రాంతాలను ఖాళీ చేయమని నివాసితులు ఆదేశాలు ఇచ్చారు. లెబనాన్  సమాచార మంత్రి ఈ ఆదేశాలను “మానసిక యుద్ధం”గా అభివర్ణించారు, లెబనీస్ పౌరులకు 80,000 ఫోన్ కాల్‌లు చేసి పారిపోవాలని కోరినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

ఇళ్లను విడిచిపెట్టిన చాలా మంది స్థానికులు పాఠశాలల్లో ఆశ్రయం పొందారు. నబతిహ్ పారిపోయిన అమల్ సబ్బా మీడియాతో మాట్లాడుతూ… “ఒక క్షణం మేము మా ఇంట్లో ఉన్నాము, తరువాత మేము మా వస్తువులను సగం విడిచిపెట్టి ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చిందని”  ఆవేదన వ్యక్తం చేశారు.

ఇజ్రాయెల్ రక్షణ మంత్రి దాడులను తీవ్రతరం చేస్తున్నట్లు ప్రకటించడంతో లెబనాన్ వైమానిక దాడులతో దద్దరిల్లుతోంది. హిజ్బుల్లాతో 2006లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్‌కు ఓటమి మిగిలింది. గాజాలో దాడులను ఎదుర్కొంటున్న పాలస్తీనియన్లకు సంఘీభావంపై దృష్టి సారించి, పెద్ద ఎత్తున యుద్ధాన్ని కోరుకోవడం లేదని హిజ్బుల్లా సూచించింది.

మరోవంక దక్షిణ లెబనాన్లోని 17 గ్రామాలు, పట్టణాల మ్యాపుల్ని ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఆపరేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో బెకా లోయతోపాటు మరిన్ని ప్రాంతాల్లో తీవ్ర దాడులుంటాయని ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి వలెవి ప్రకటించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles