28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్‌ పరీక్షించనున్న ‘నాసా’!

వాషింగ్టన్:  ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నేడు ఆవిష్కరించనున్నది. ఆర్టెమిస్‌ మిషన్‌లో భాగంగా ఈ రాకెట్‌ ద్వారా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపనున్నది. ఆర్టెమిస్‌-1 మానవ రహిత ప్రయోగం కాగా, ఆర్టెమిస్‌ 2,3,4,5 దశల్లో వ్యోమగాములను జాబిల్లిపైకి పంపనున్నారు. ఈ మిషన్‌ ద్వారా తొలిసారి చంద్రమండలంపైకి మహిళా వ్యోమగామిని పంపేందుకు నాసా రంగం సిద్ధం చేస్తున్నది. చంద్రుడిపై సుదీర్ఘకాలం పరిశోధనలు కొనసాగించేందుకు అవసరమైన ఉపకరణాలను కూడా పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది. భవిష్యత్తులో అక్కడికి వెళ్లే వ్యోమగాములు వాటిని ఉపయోగించుకోవటానికి వీలుంటుందని వివరించింది. అక్కడ ఆర్టెమిస్‌ బేస్‌ క్యాంప్‌ను నిర్మిస్తామని, ఒక గేట్‌వేను కూడా సిద్ధం చేస్తామని తెలిపింది. అత్యాధునిక మొబైల్‌ ఇల్లు, రోవర్‌ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. భవిష్యత్తులో అంగారక గ్రహంపైకి వెళ్లేందుకు ఇవి దోహదం చేస్తాయని పేర్కొన్నది. కాగా, నాసా పంపే రాకెట్‌లో రెండు సాలిడ్‌ రాకెట్‌ బూస్టర్లు, నాలుగు ఆర్‌ఎస్‌-25 ఇంజిన్లు ఉంటాయి. భూమి ఉపరితలం నుంచి రాకెట్‌ 4.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రుడిపైకి చేరుకొంటుంది.

నాసా చివరి సారిగా అపోలో17 ప్రాజెక్ట్‌ పేరుతో లూనార్ రోవింగ్ వాహనాన్ని ఉపయోగించి జియాలజిస్ట్‌ హారిసన్ ష్మిత్‌ను 1972 డిసెంబర్‌ నెలలో చంద్రుని ఉపరితలంపై (లూనార్‌ సర్ఫేజ్‌) పంపింది. ఆ సందర్భంగా హారిసన్‌ ష్మిత్‌ చంద్రుడిపై రాళ్లు,దూళిని భూమిపైకి తీసుకొచ్చారు. ఆ తరువాత చంద్రుడిపైకి ఎవరు వెళ‍్లలేదు. అయితే తాజాగా నాసా చంద్రడిపైకి మనుషుల్ని పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

2025లో చంద్రునిపై మొదటి మానవ ల్యాండింగ్

ఏప్రిల్ లేదా మేలో ఆర్టెమిస్ I లాంచ్ విండోలను సమీక్షిస్తున్నట్లు NASA తెలిపింది ఎనిమిది లేదా తొమ్మిది రోజుల తర్వాత ఆ పరీక్షలు పూర్తయ్యాయి. రాకెట్ నుండి ప్రొపెల్లెంట్‌ను తొలగించిన తర్వాత, తిరిగి ప్రయోగించేందుకు అనువుగా రాకేట్‌ ప్రయోగ వాహక నౌను తిరిగి అసెంబ్లీ భవనానికి తీసుకెళతారు. నాసా ఆర్టెమిస్‌ను 2025 నవంబర్‌ నాటికి చంద్రునిపై ల్యాండింగ్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది, దీనికి ముందు సిబ్బందితో కూడిన ఆర్టెమిస్ విమానం చంద్రుని చుట్టూ పరిభ్రమించి 2024లో తిరిగి వస్తుంది.  ఆ రెండు మిషన్లు SLS రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపిస్తారు. ఇది మానవ సహిత అంతరిక్షయానం కోసం నాసా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన ప్రయోగ వాహనంగా రికార్డుకెక్కింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles