28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఫెడెక్స్‌ నూతన సీఈవోగా ఇండో – అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం!

శాన్‌ఫ్రాన్సిస్‌కో: మరో అంతర్జాతీయ సంస్థకు భారత సంతతికి చెందిన అమెరికన్ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. తాజాగా.. భారత సంతతికి చెందిన అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం ఫెడెక్స్‌ (FedEx) సంస్థ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన బహుళజాతి కొరియర్ సర్వీస్(Courier Service) దిగ్గజం సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. జూన్ 1, 2022న పదవీవిరమణ చేయనున్న ఫ్రెడరిక్ డబ్ల్యూ స్మిత్ స్థానంలో ఇండో-అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం బాధ్యతలు స్వీకరిస్తారు.

రాజ్ సుబ్రమణ్యంపై నమ్మకం ఉంది.. 
‘కంపెనీకి మరో స్థాయికి తీసుకెళ్లే వ్యక్తి రాజ్ సుబ్రమణ్యం అని నేనే నమ్ముతున్నాను. వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు నడిపే సామర్థ్యం ఆయనకు ఉంది. సుస్థిరత, ఆవిష్కరణ, పబ్లిక్ పాలసీలతో పాటు మరెన్నో అంశాలపై ఫోకస్ చేస్తారు. రాజ్ సుబ్రమణ్యం లాంటి వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించడం సంస్థకు మరిన్ని విజయాలు అందిస్తుందని’ నూతన సీఈఓగా నియమితులైన రాజ్ సుబ్రమణ్యంపై ఫ్రెడరిక్ స్మిత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఫెడెక్స్ ప్రస్తుత సీఈఓ, వ్యవస్థాపకుడు ఫ్రెడరిక్ స్మిత్‌పై కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న  రాజ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ… ‘స్మిత్ 1971లో ఫెడెక్స్ సంస్థను స్థాపించారు. ఆయన దార్శనికత కలిగిన నాయకుడు, వ్యాపారవేత్త. ప్రపంచంలో ఎంతో గుర్తింపు కలిగిన సంస్థను ప్రారంభించిన దిగ్గజం ఫ్రెడరిక్ స్మిత్. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో కలిసొచ్చింది. ఇప్పుడు ఆయన స్థానంలో కీలక బాధ్యతలు చేపట్టనుండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఆయన మొదలుపెట్టిన కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి నా వంతుగా శ్రమిస్తానని పేర్కొన్నారు.

కేరళలోని తిరువనంతపురానికి చెందిన  రాజ్ సుబ్రమణ్యం 1991లో ఫెడెక్స్ లో చేరారు. ఆసియా, అమెరికాలో పలు మార్కెటింగ్ సంస్థలలో మేనేజ్‌మెంట్ బాధ్యతలు నిర్వర్తించారు. ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ కెనడాలో ప్రెసిడెంట్‌గా చేశారు. సీఈఓగా నియమితులు అవకముందు ఫెడెక్స్ కార్పొరేషన్ సీఈఓగా సేవలు అందించారు.

ఫెడెక్స్ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న  రాజ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ… ప్రస్తుతం ఫెడెక్స్ కంపెనీలో 6 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరినీ చూసి నేను చాలా గర్వపడుతున్నాను.  మేమంతా కలిసి ప్రపంచాన్ని మంచిగా మార్చే ఆలోచనలను రూపొందించాము, అలాగే మా ఫెడెక్స్ బృందం, మేము కలిసి మా వినియోగదారులు,  వాటాదారుల కోసం కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తామని  ఆయన చెప్పారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles