24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

ద్వైపాక్షిక చర్చల కోసం అమెరికా చేరుకున్న భారత రక్షణ, విదేశాంగ మంత్రులు!

వాషింగ్టన్‌: సోమవారం భారత్‌, అమెరికా మధ్య ఇరు దేశాలకు చెందిన ఇద్దరు చొప్పున మంత్రుల (‘2+2’ మంత్రుల చర్చలు) మధ్య నాలుగో వార్షిక రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖల చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశం కోసం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమెరికా రాజధాని వాషింగ్టన్‌ చేరుకున్నారు. వాషింగ్టన్‌లో  అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అంటోని బ్లింకెన్‌, అమెరికా రక్షణ మంత్రి లాయడ్‌ ఆస్టిన్‌తో వారు సమావేశమవుతున్నారు. బైడెన్‌ పరిపాలనలో ఇలాంటి చర్చలు జరగటం ఇదే మొదటిసారి. నేడు జరిగే ఈ సమావేశాల్లో రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాలు, వాతావారణం, ప్రజారోగ్యం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఉక్రేనియన్ సంక్షోభ సమయంలో జరగనున్న ఈ ద్వైపాక్షిక సమావేశానికి రెండు ప్రభుత్వాలు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చాయి. మరోవంక అధ్యక్షుడు బిడెన్ నేడు వైట్ హౌస్ నుండి ప్రధాని నరేంద్ర మోడీతో వర్చువల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇద్దరు భారతీయ మంత్రులు – రాజ్‌నాథ్‌ సింగ్‌కు పెంటగాన్ వద్ద అమెరికా రక్షన కార్యదరర్శి లాయిడ్‌ ఆస్టిన్ రెడ్ కార్పెట్ స్వాగతం ఇవ్వనున్నారు. విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో జైశంకర్‌ని అమెరికా విదేశాంగా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కలుసుకోనున్నారు. ఆ తర్వాత, నలుగురు మంత్రులు మోడీ-బిడెన్ వర్చువల్ మీటింగ్ కోసం వైట్‌హౌస్‌కు వెళతారు.

బైడెన్‌తో ప్రధాని మోడీ నేడు వర్చువల్‌ భేటీ!
అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌తో ప్రధాని మోడీ సోమవారం వర్చువల్‌గా సమావేశం కానున్నారు. రష్యాతో వాణిజ్య సంబంధాలకు దూరంగా ఉండాలని మనదేశాన్ని అమెరికా పదేపదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. దక్షిణాసియా ప్రాంతంలో ఇటీవలి పరిణామాలు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంసహా పలు ప్రపంచ సమస్యలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నట్లు భారత విదేశాంగశాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌ పరిస్థితి కూడా చర్చకు వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో పర్యటించిన బైడెన్‌ ప్రభుత్వంలోని కీలక నేత దలీప్‌ సింగ్‌ రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతులపై తీవ్రంగా హెచ్చరించారు. దలీప్‌ సింగ్‌ వ్యాఖ్యలను హెచ్చరికలుగా చూడకూడదని వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల నేతల వర్చువల్‌ భేటీ కీలకం కానుంది. ఈ భేటీలో భారత్‌, అమెరికా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, ఆస్టిన్‌, విదేశాంగ మంత్రులు జైశంకర్‌, ఆంటోని బ్లింకెన్‌ శ్వేతసౌథం నుంచి పాల్గొననున్నారు. అనంతరం 2+2 రక్షణ, విదేశాంగ మంత్రులు సమావేశంలో వీరు తమ ప్రతినిధి బృందాలతో కలిసి పాల్గొననున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles