33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

అప్ఘన్‌లో బాంబు దాడి… 33మంది మృతి!

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. శుక్రవారం ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని ఓ మసీదు, మతపరమైన పాఠశాలలో ప్రార్థనల సమయంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ దాడిలో పిల్లలతో సహా 33 మంది మరణించారు. ఈ ఘటనలో మరో 43 మందికి గాయాలయ్యాయని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. క్షతగాత్రుల్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఐఎస్ఐఎస్ గ్రూపు రెండు వేర్వేరు ఘోరమైన దాడులకు పాల్ప‌డిన త‌రువాత రోజు ఈ దాడులు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఉత్తర ప్రావిన్స్‌లోని కుందుజ్ లో ఇమామ్ సాహెబ్ పట్టణంలో ఈ ఘటన జరిగిందని జబీహుల్లా ముజాహిద్ ట్వీట్​ చేశారు. తాము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామనీ, మృతులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పారు.
పేలుడు జరిగిన మసీదు దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. మృతదేహాలు ఎక్కడిక్కడ చెల్లా చెదురుగా పడి ఉండటం చూసిన ఎవ్వరికైనా ఈ దృశ్యాలు భయం కలిగించేలా ఉన్నాయి. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
అలాగే.. ఉత్తర మజర్-ఇ-షరీఫ్​​లోని మసీదుపై కూడా గురువారం బాంబు దాడికి జ‌రిగింది. ఈ బాంబు పేలుడులో 10 మంది మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. ఈ దాడుల‌కు పాల్పడింది ఎవరో తెలియాల్సి ఉంది. ఇలాంటి దాడులు ఎక్కువ‌గా.. ఐసిస్​ చేస్తుంది. కావున‌.. ఈ దాడుల్లో కూడా ఐసిస్ పాత్రే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. యుఎస్-మద్దతుగల ప్రభుత్వాన్ని తొలగించిన తర్వాత తాలిబాన్ యోధులు గత సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్‌పై నియంత్రణను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, బాంబు దాడుల సంఖ్య తగ్గింది, అయితే జిహాదిస్ట్, సున్నీలు మతవిశ్వాసంగా భావించే లక్ష్యాలపై దాడులను కొనసాగించారు. షియా పరిసరాల్లోని పాఠశాల, మసీదును లక్ష్యంగా చేసుకుని ఘోరమైన దాడులతో, ఈ వారంలో వరుస బాంబు దాడులు దేశాన్ని కదిలించాయి.
2021లో తాలిబన్లు అఫ్ఘానిస్థాన ను హస్తగతం చేసుకుని అధికారం చేపట్టాక జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటిగా భావిస్తున్నారు. ఇది కూడా ఐసిస్ పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అఫ్ఘానిస్థాన్ లోని షియా, సూఫీ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన చరిత్ర ఐసిస్ కు ఉంది. ఇప్పుడు దాడి జరిగిన మసీదు కూడా సూఫీ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతానికి చెందినది.

తాలిబాన్‌లకు సవాలు!
కాబూల్‌లోని షియా పరిసరాల్లోని బాలుర పాఠశాలలో మంగళవారం జరిగిన జంట పేలుళ్లలో ఆరుగురు మరణించగా, 25 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనకు బాధ్యులెవరో ఇంకా తేలలేదు. ఎక్కువగా హజారా కమ్యూనిటీకి చెందిన షియా ఆఫ్ఘన్‌లు, ఆఫ్ఘనిస్తాన్ జనాభా 38 మిలియన్లలో 10 మరియు 20 శాతం మధ్య ఉన్నారు.
తాలిబాన్ అధికారులు తమ బలగాలు ఐఎస్‌ఐఎస్‌ (ISIS) ని ఓడించాయని ప్రకటిస్తున్నారు, అయితే విశ్లేషకులు మాత్రం ఈ జిహాదిస్ట్ గ్రూప్ తాలిబన్‌లకు సవాలు విసురుతుందని చెప్పారు. “తాలిబాన్ అధికారం చేపట్టినప్పటి నుండి, వారు గర్వపడే ఏకైక విజయం భద్రతలో మెరుగుపరచడం” అని స్వతంత్ర రాజకీయ, భద్రతా నిపుణుడు హెక్మతుల్లా హెక్మత్ అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles