28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఉక్రెయిన్‌కు అత్యాధునిక రాకెట్లు… అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన!

వాషింగ్ట‌న్‌: రష్యాతో యుద్ధం విషయంలో ఉక్రెయిన్‌కు కీలక సాయం అందించేందుకు ఎట్టకేలకు అగ్రరాజ్యం ముందుకొచ్చింది. సుదీర్ఘ నిర్ణీత లక్ష్యాలను నాశనం చేసే అత్యాధునిక రాకెట్‌ వ్యవస్థను ఉక్రెయిన్‌కు అందించేందుకు అధ్యక్షుడు జో బైడెన్‌ అంగీకరించారు. ర‌ష్యా టార్గెట్ల‌ను చేధించేందుకు ఉక్రెయిన్‌కు లాంగ్ రేంజ్ అడ్వాన్స్‌డ్ రాకెట్ సిస్ట‌మ్స్‌ను ఇస్తున్న‌ట్లు బైడెన్ తెలిపారు. దాదాపు 700 మిలియ‌న్ల డాల‌ర్ల ఖ‌రీదైన ఆయుధ ప్యాకేజీకి అమెరికా ఓకే చెప్పింది. దానిలో భాగంగా ఈ అడ్వాన్స్‌డ్ రాకెట్ల‌ను ఇవ్వ‌నున్నారు.

సుమారు 80 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్ల‌ను ఈ రాకెట్ల అత్యంత క‌చ్చిత‌త్వంతో చేధించ‌గ‌ల‌వు. అయితే ర‌ష్యాపై దాడులు జ‌రిపేందుకు మిస్సైళ్లు వాడ‌బోమ‌ని ఉక్రెయిన్ హామీ ఇచ్చిన నేప‌థ్యంలో అమెరికా ఈ ప్ర‌క‌ట‌న చేసింది. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఉక్రెయిన్‌పై ర‌ష్యా ఆక్ర‌మ‌ణ అంశం దౌత్యంతో ప‌రిష్కారం అవుతుంద‌ని, కానీ ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాల‌ను ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని బైడెన్ అన్నారు.

అమెరికా నుంచి.. రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచే అత్యాధునిక ఆయుధ సంపతి సాయం కోరుతోంది ఉక్రెయిన్‌. అయితే ఉక్రెయిన్‌ భూభాగంపై రష్యా దాడులను తిప్పికొట్టడానికే తప్ప.. రష్యా భూభాగంలో మాత్రం ఆ రాకెట్లను ప్రయోగించడానికి వీల్లేదని షరతు మీదే ఇప్పుడు సాయం అందించనున్నట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌లోని యుద్దభూమిలో కీలక లక్ష్యాలను మరింత ఖచ్చితంగా చేధించడానికి వీలు కల్పించే మరింత అధునాతన రాకెట్ వ్యవస్థలు, ఆయుధ సామాగ్రిని మేము ఉక్రేనియన్లకు అందించాలని నిర్ణయించుకున్నాను. ఇది రష్యాపై ఉక్రెయిన్‌ యుద్ధం కోసం కాదు.. కేవలం ఉక్రెయిన్‌ తనను తాను కాపాడుకోవడం కోసం, నిర్ణీత శత్రు లక్ష్యాలను నాశనం చేసేందుకు,  చర్చల్లో ఉక్రెయిన్‌కు ప్రాధాన్యత పెరగడం కోసమే అని బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న రష్యా దాడిలో వేలాది మంది మరణించారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు, దీనిని మాస్కో ప్రత్యేక సైనిక చర్య”గా పేర్కొంటోంది. యుక్రెయిన్, దాని పాశ్చాత్య మిత్రదేశాలు మాత్రం మిలిటరీ ఆపరేషన్‌ సాకుతో ఉక్రెయిన్‌ భూభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోందని చెబుతున్నాయి.

ఇంటెలిజెన్స్ అధికారులు ఊహించిన దానికంటే ఎక్కువ రోజులు ఉక్రెయిన్‌ రష్యాతో పోరాడుతున్నందున, M777 హోవిట్జర్‌లతో సహా అత్యాధునిక ఆయుధాలను ఇవ్వడానికి పశ్చిమ దేశాలు ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. కానీ యూఎస్‌ ఇంటెలిజెన్స్ మాత్రం పెరుగుతున్న ప్రమాదాల గురించి హెచ్చరించింది,

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles