23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘సౌదీ’ గగనతలంపై ఉన్న ఆంక్షల తొలగింపు. ఈ చర్య ఇజ్రాయెల్‌కు అనుకూలం!

రియాద్: సౌదీ అరేబియా తన గగనతలంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు నేడు (శుక్రవారం) ప్రకటించింది. ‘సౌదీ‘ పౌర విమానయాన అథారిటీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇజ్రాయెల్ విమానాలు ఇకనుంచి సౌదీ అరేబియా గగనతలం మీదుగా నిరభ్యంతరంగా ప్రయాణించ వచ్చు.
ఇది అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సౌదీ అరేబియాలో పర్యటించే ముందు ఆ దేశం తీసుకున్న అతి ముఖ్యమైన విధాన నిర్ణయం.
ఈ “చారిత్రక” నిర్ణయాన్ని అగ్రరాజ్యం అధిపతి జో బిడెన్ స్వాగతించారు. యూదు రాజ్యానికి సంబంధించి రియాద్ చేసిన తాజా సామరస్య చర్య, అరబ్ దేశాలతో సంబంధాలను నెలకొల్పడానికి ఇజ్రాయెలీలు చేస్తున్న ప్రయత్నాలకు గుర్తింపు దక్కవచ్చంటున్నారు.

సౌదీ పౌర విమానయాన అథారిటీ తన గగనతలాన్ని తెరవాలనే నిర్ణయాన్ని ట్విట్టర్‌లో ఒక ప్రకటనలో తెలిపింది.

మధ్యప్రాచ్య పర్యటనలో భాగంగా ఈ శుక్రవారం తర్వాత అతి ముఖ్యమైన పర్యటన నిమిత్తం యూఎస్ అధ్యక్షుడు సౌదీ అరేబియాలో అడుగుపెట్టనున్నారు.
ఆ తర్వాత రోజు ఈ పర్యటన పురోగతిపై మరిన్ని విషయాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles