23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

పాకిస్తాన్‌లో వరదలు… వేయి మంది మృతి, 33మిలియన్ల నిరాశ్రయులు!

ఇస్లామాబాద్: అసలే ఆర్థిక సంక్షోభం.. ఆపై కుండపోత వర్షాలు.. పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. దాయాది దేశాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.   బలూచిస్థాన్‌లోని దక్షిణ ప్రావిన్స్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు మహిళలు, పిల్లలు మృతి చెందుతున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. బలూచిస్థాన్‌లో వర్షాల వల్ల తీవ్ర నష్టం ఏర్పడింది. దక్షిణ ప్రావిన్స్‌లో వరద దాటికి ఎనిమిది ఆనకట్టలు తెగిపోయాయి. వరదలతో ఇప్పటికే వేయిమంది వరకు మరణించారు.

2010 తర్వాత పాకిస్తాన్‌లో మళ్లీ భారీ వర్షాలు కురిశాయి. దారుణమైన వరదలు తలెత్తాయి. దీంతో 33 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పెద్ద మొత్తంలో పంటలు నాశనమయ్యాయి. వరదలతో పాకిస్థాన్ దాదాపుగా అతలాకుతలం అయింది. నిరాశ్రయులను ఆదుకోవాలని పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.

ఈ నెలలో సింధ్ ప్రావిన్స్‌లో గత ఏడాది ఆగస్టు సగటు కంటే “784 శాతం” ఎక్కువ వర్షపాతం నమోదైందని, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో దాదాపు 500 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ మార్పుల మంత్రి షెర్రీ రెహ్మాన్ రాయిటర్స్ వార్తా సంస్థకు ఇచ్చిన సందేశంలో తెలిపారు.

దక్షిణ ప్రావిన్స్, గత కొన్ని రోజులుగా తీవ్రంగా దెబ్బతిన్నదని, బాధిత ప్రజల కోసం 1 మిలియన్ టెంట్లను అభ్యర్థించిందని ఆమె తెలిపారు. “దక్షిణ పాకిస్తాన్ దాదాపు నీటిలోనే ఉంది. … ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్తున్నారని” ఆమె తెలిపింది.

“అవసరాల అంచనా వేస్తున్నాం.  మేము UN యొక్క అంతర్జాతీయ ఫ్లాష్ అప్పీల్ చేయాలి; ఇది ఒక దేశం లేదా ఒక ప్రావిన్స్ యొక్క పని కాదు, ఇది వాతావరణ ప్రేరిత విపత్తు,” ఆమె పేర్కొన్నారు. హైవేలు, రోడ్లు, వంతెనలు ధ్వంసంమయ్యాయి. 39వేల గృహాలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది పాకిస్థాన్‌లో సగటు వర్షపాతం కంటే 87శాతం అధికంగా నమోదైందని మంత్రి షెర్రీ రెహ్మాన్ వెల్లడించారు. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వాతావరణ-హానీ కలిగించే దేశాలలో పాకిస్థాన్ కూడా చేరిపోయిందని ఆమె తెలిపారు.

ప్రణాళిక మరియు అభివృద్ధి మంత్రి అహ్సాన్ ఇక్బాల్ విడిగా రాయిటర్స్‌తో మాట్లాడుతూ 30 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు, ఇది దక్షిణాసియా దేశ జనాభాలో 15 శాతానికి సమానం అని పేర్కొన్నారు.

వేలాది మంది నిర్వాసితులయ్యారు
యూఎన్‌ ఏజెన్సీ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (OCHA) గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. రుతుపవనాల కారణంగా కురిన భారీ వర్షాలు పాకిస్తాన్‌లో సుమారు మూడు మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేశాయని, వారిలో 184,000 మంది దేశవ్యాప్తంగా సహాయ శిబిరాలకు వెళ్లారని ఆ ప్రకటన తెలిపింది. అసలే అప్పుల్లో ఉన్న పాకిస్థాన్‌కు పునర్నిర్మాణ ప్రయత్నాలు ఒక సవాలుగా మారతాయి, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తక్షణమే డబ్బుని విడుదల చేసిన పాకిస్థాన్‌ను ఆదుకోవాల్సి ఉందని యూఎన్‌ తెలియజేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 150 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, 82,000 ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎంఎ) ఒక నివేదికలో తెలిపింది.

జూన్ మధ్యలో రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి, NDMA యొక్క  నివేదిక ప్రకారం, 3,000 కిలోమీటర్ల రహదారి, 130 వంతెనలు, 495,000 గృహాలు దెబ్బతిన్నాయి, గణాంకాలు OHCA నివేదిక పేర్కొంది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles