24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

కెనడాలో కత్తిపోట్లు… 10 మంది మృతి, 15మందికి గాయాలు!

ఒట్టావా: కెనడాలో దారుణం జరిగింది.  సస్కాచెవాన్ ఫ్రావిన్స్ లో ఆదివారం ఇద్దరు దుండగులు పౌరులపై కత్తులతో దాడులకు దిగారు. ఈ దాడిలో 10 మంది మరణించారు. దాదాపు 15మంది గాయపడ్డారు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ప్రకారం.. డామియన్ శాండర్సన్( 31),మైల్స్ శాండర్సన్(30)అనే ఇద్దరు వ్యక్తులు ఈ దాడలకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. దాడుల తరువాత ఈ ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు కెనడా పోలీస్ అధికారులు తెలిపారు. సస్కాచెవాన్ లోని జేమ్స్ స్మిత్ క్రీ నేషన్‌,సాస్కటూన్‌కు ఈశాన్య ప్రాంతంలోని వెల్డన్ గ్రామంలో ఆదివారం ఈ కత్తిపోట్లు జరిగినట్లు పోలీసులు తెలిపారు.

సస్కాచెవాన్‌లో 13 లొకేషన్‌లలో 10 మంది మృతదేహాలను గుర్తించామని పోలీసులు వివరించారు.  ఊహించని ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వచ్చినప్పుడు రక్షణ చర్యలు పాటించాలని కోరారు. కొందరిని లక్ష్యంగా చేసుకుని, మరికొందరపై ఆకస్మాత్తుగా దాడి చేసినట్లు భావిస్తున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కెనడా ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి!
ఈ ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది భయంకరమైన, హృదయ విదారకరమైన ఘటన అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles