33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

గల్ఫ్ సంక్షోభం… చమురు ధరలు పైపైకి!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన అనుమానిత డ్రోన్ దాడిలో మూడు ఇంధన ట్యాంకర్లను పేల్చివేశారు.
అబుదాబి విమానాశ్రయం సమీపంలో సోమవారం జరిగిన దాడిలో ముగ్గురు వ్యక్తులు కూడా మరణించారు. దీనికి ప్రతీకారంగా సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళం యెమినీ రాజధాని సనాపై వైమానిక దాడులతో ప్రతీకారం తీర్చుకుంది, 20 మంది మరణించారు. కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడిప్పుడే ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ జరుగుతున్న సమయంలో
మధ్యప్రాచ్యంలోని ఇంధన నిల్వ కేంద్రంపై దాడి… చమురు సరఫరాను ప్రభావితం చేస్తుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. చమురు ధర మంగళవారం ఏడేళ్లలో అత్యధిక స్థాయికి చేరుకుంది. గల్ఫ్‌లో ఏర్పడిన తాజా సంక్షోభం కారణంగా బ్యారెల్‌ చమురు ధర 89 డాలర్లను తాకింది. పైగా నిన్న అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ 0.5 శాతంపైగా పెరిగింది. డాలర్‌తో పాటు క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగాయంటే… దిగుమతి కోసం మన దేశం భారీ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. తాజా పరిస్థితితో ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీల ఆర్థిక పరిస్థితి డైలమాలో పడింది. గల్ఫ్‌లో పరిస్థితి చల్లబడితే క్రూడ్‌ కాస్త తగ్గుతుందేమోగాని… భారీగా తగ్గే ప్రసక్తేలేదు. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అంచనా ప్రకారం సెప్టెంబర్‌కల్లా క్రూడ్‌ ఆయిల్‌ ధర 100 డాలర్లకు చేరనుంది. చమురు సమృద్ధిగా ఉన్న దేశంపై దాడులతో ఏడేళ్ల తర్వాత చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరాయి.
చమురు ధరలకు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ దాదాపు 1% పెరిగి బ్యారెల్ $87.22కి చేరుకుంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ముడి చమురు బ్యారెల్‌కి 1.3% పెరిగి $84.89కి చేరిన యూఎస్ఏలో ధరల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది.
చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లతో ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా 2014 తర్వాత తొలిసారిగా ముడి చమురు బ్యారెల్‌కు $100 మార్కును చేరువ కావడంపై ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పేవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles