23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు… ‘సావర్కర్ సంఝా క్యా’ అని ట్వీట్ చేసిన కాంగ్రెస్!

న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ జనవరి 30న శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకున్నారు.  లైంగిక వేధింపులకు సంబంధించి ఆయనను సంప్రదించిన మహిళల వివరాలను అందించాలని పోలీసులు మార్చి 16న రాహుల్‌గాంధీకి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

శ్రీనగర్‌లో భారత్‌ జోడోయాత్ర నిర్వహిస్తున్న సమయంలో ఇప్పటికీ స్త్రీలపై వేధింపులు జరుగుతున్నాయని రాహుల్‌గాంధీ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళల వివరాలను తెలుసుకుని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ వివరాలు ఇవ్వకపోతే.. అతనికి మరో నోటీసు ఇస్తామని ఢిల్లీ పోలీస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, రాహుల్‌గాంధీకి నోటీసులు జారీ చేయడంపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుల పేర్లను వెల్లడించమని ఢిల్లీ పోలీసులు అతనిని బలవంతం చేయలేరని మండిపడింది.

బీజేపీని ఉద్దేశించి ‘సావర్కర్ సంఝా క్యా’ నామ్ రాహుల్ గాంధీ హై” అంటూ కాంగ్రెస్ మండిపడింది.  ట్వీట్ కూడా చేసింది.

న్యాయశాఖ మంత్రి, బీజేపీ నేత కిరణ్ రిజిజు ట్విట్టర్‌లో స్పందిస్తూ… గొప్ప వ్యక్తిత్వాన్ని (వీర్ సావర్కర్) అవమానించవద్దని “నేను ముకుళిత హస్తాలతో అభ్యర్థిస్తున్నాను,” మంత్రి  కోరారు.

కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ కారు డ్రైవర్ సీటులో ఉన్న ఫోటోను ట్వీట్ చేస్తూ, “సావర్కర్ సంఝా క్యా… నామ్- రాహుల్ గాంధీ హై (మీరు అతన్ని సావర్కర్‌గా భావించారా?… పేరు రాహుల్ గాంధీ)” అని పేర్కొంది.

దీనిపై రిజిజు స్పందిస్తూ, “కృప్యా మహాన్ ఆత్మ వీర్ సావర్కర్ కా అప్మాన్ నా కరేన్. హాత్ జోడ్ కర్ వినతీ కర్తా హు (దయచేసి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వీర్ సావర్కర్‌ను అవమానించకండి. ముకుళిత హస్తాలతో నేను అభ్యర్థిస్తున్నాను)” అని మంత్రి ట్వీట్ చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles