28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

బెంగళూరులో అట్టహాసంగా ఆరంభమైన విపక్షాల భేటీ…40 మందికి పైగా నేతలు హాజరు!

బెంగళూరు: కలుద్దాం, నిలుద్దాం’ నినాదంతో విపక్ష కూటమి నిర్వహిస్తున్న మేథోమథన సమావేశం నిన్న బెంగళూరులో అట్టహాసంగా ప్రారంభమైంది.  ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇచ్చిన విందుకు దేశ వ్యాప్తంగా 40 మందికి పైగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు హాజరయ్యారు.

కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, జేడీయూకి చెందిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), పార్టీ నాయకుడు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి, JMM అధినేత హేమంత్ సోరెన్, శివసేన-UBT చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, PDP చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, బీహార్ మాజీ సీఎం  లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఎం నేత సీతారాం ఏచూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ సహా 26 విపక్ష పార్టీల అధినేతలు, అగ్ర నేతలు సాయంత్రానికల్లా సమావేశ వేదిక వద్దకు చేరుకున్నారు. రాత్రి పొద్దుపోయేదాకా చర్చోపచర్చల్లో మునిగి తేలారు. బీజేపీని నిలువరించడమే ఏకైక అజెండాగా  నేతలు తొలి దఫా చర్చలు జరిపి అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యతా సందేశాన్ని పంపారు.

ఇక కాంగ్రెస్ అంటే చిరకాలంగా ఉప్పునిప్పుగా ఉన్న మమత విందు భేటీలో సోనియా పక్కనే కూర్చోవడం ప్రధానాకర్షణగా నిలిచింది. ఆ సందర్భంగా వారిరువురూ 20 నిమిషాల పాటు చర్చలు కూడా జరిపారు.

కొత్త కూటమి పేరు కూడా నేటి చర్చల అజెండాలో ఉన్నట్టు సమాచారం. “ఇండియా” అని వచ్చేలా కూటమికి ఆకర్షణీయమైన పేరును పార్టీలన్నీ సూచిస్తాయి. ‘యునైటెడ్ వుయ్ స్టాండ్’ అన్నది. ట్యాగ్లన్ ఉండనుంది” అని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

  • ‘అంతేగాక యూపీఏ చైర్పర్సన్ గా వ్యవహరించిన సోనియాగాందీని కొత్త కూటమి సారథిగా వ్యవహరించే అవకాశముందని చెబుతున్నారు.
  • సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే ప్రధాన లక్ష్యాలుగా ఉమ్మడి కార్యాచరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
  • నేటి భేటీ అనంతరం సంయుక్త ప్రకటనతో పాటు ఉమ్మడి ఆందోళన ప్రణాళికను కూడా విపక్షకూటమి ప్రకటించవచ్చని సమాచారం.
  • కీలకమైన రాష్ట్రాలవారీగా పార్టీలవారీగా పోటీ చేయాల్సిన లోక్‌సభ స్థానాల సంఖ్యను ఖరారు చేసుకోవడం వంటివీ చర్చకు వస్తాయంటున్నారు.
  • ఒక కమిటీతో పాటు కనీస ఉమ్మడి ప్రణాళిక, విపక్షాల సంయుక్త నిరసన కార్యక్రమాల ఖరారుకు రెండు సబ్ కమిటీలు కూడా ఏర్పాటు చేసే అవకాశముంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles