24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

జులై 29-30న మణిపూర్‌కు విపక్ష ఇండియా ఎంపీల ప్రతినిధి బృందం!

న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీల ప్రతినిధి బృందం జులై 29-30 తేదీలలో సంక్షుభిత మణిపూర్‌ను సందర్శించనున్నది. గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే చాంబర్‌లో సమావేశమై పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన ఇండియా కూటమి ఎంపీలు మణిపూర్‌ను సందర్శించి అక్కడి వాస్తవ పరిస్తితిని తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

మణిపూర్‌కు వెళ్లే ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు, సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్, ఎంపీ జావేద్ అలీతో పాటు మరికొందరు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఆ పార్టీ బహిష్కృత ఎంపీ సంజయ్ సింగ్,  సందీప్ పాఠక్‌లు ప్రతినిధులుగా ఉండే అవకాశముంది.

మణిపూర్‌కు వెళ్లే ప్రతిపక్ష ప్రతినిధి బృందంలో ఎన్‌సిపి ఎంపి ఫైసల్ మహ్మద్, డిఎంకె ఎంపి కనిమొళి కూడా భాగమవుతారని వర్గాలు సూచిస్తున్నాయి.

ఈ సందర్భంగా తృణమూల్ ఎంపీ సుస్మితా దేవ్ ఇండియా టుడేతో మాట్లాడుతూ… “మేము ప్రతినిధి బృందంలో విడిగా వెళ్తాము. పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులుగా మేము వాస్తవ పరిస్థితులను కనుగొనాలనుకుంటున్నాము. మా పర్యటనకు ప్రభుత్వం అనుమతించాలి. మేము వెళ్లొచ్చాక మణిపూర్ ప్రజల కష్టాలపై మాట్లాడతాం అని అన్నారు.”

“మణిపూర్ వాణిని తీసుకురావడంలో మీడియా అద్భుతంగా పని చేస్తోందని మాకు తెలుసు. అయితే ఇంకా వెలుగుచూడని విషయాలు అనేకం ఉన్నాయి.పార్లమెంటు సభ్యులుగా మేము మణిపూర్‌పై చర్చను తీసుకురావాలనుకుంటున్నాము. విపక్ష ఇండియా కూటమిలో భాగంగా అన్ని పార్టీల ఎంపీలు మణిపూర్ వాణిని వినిపించబోతున్నాం అని తృణమూల్ ఎంపీ అన్నారు.

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపి డాక్టర్ ఎస్‌టి హసన్ మాట్లాడుతూ… మణిపూర్‌లో ఏమి జరుగుతుందో… ముఖ్యంగా రాష్ట్ర మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులకు  వాస్తవ చిత్రాన్ని చూడటానికి ప్రభుత్వం వారిని అనుమతించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు, .

ఎంపీ హసన్ ఇంకా మాట్లాడుతూ…. “మణిపూర్ మే  హుమారి బేటియోం కే సాథ్ జో హో రహా హై  క్యా ఐసా వీడియో ఆప్నే కభీ దేఖా హై (మణిపూర్‌లో మా కుమార్తెలపై ఏం జరుగుతోంది- మీరు ఎప్పుడైనా అలాంటి వీడియో చూశారా?”

విపక్ష ఇండియా ఎంపీలు తీవ్రవాదులు… ప్రధాని మోదీ

“విపక్ష ఎంపీల కూటమిలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రధాని మోదీ మమ్మల్ని టెర్రరిస్టు అని అనడం బాధ కలిగిస్తోంది’ అని సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీ డాక్టర్ ఎస్‌టి హసన్ అన్నారు.

మణిపూర్‌లో కొనసాగుతున్న జాతి ఘర్షణలు, రాష్ట్రంలో నమోదవుతున్న మహిళలపై జరిగిన ఘోరమైన నేరాల దృష్ట్యా విపక్ష ఇండియా కూటమిలోని 18 పార్టీలలో ప్రతి ఒక్కటి ఒక పార్లమెంటు సభ్యుడిని మణిపూర్‌ సందర్శించేందుకు పంపుతోంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles