23.7 C
Hyderabad
Monday, September 30, 2024

బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం ప్రమాదకరం… సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విధానంపై సుప్రీంకోర్టు గురువారం పలు ప్రశ్నలు సంధించింది. బిల్కిస్ దోషులకే క్షమాభిక్ష ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించింది. ఇలాంటి చర్య ప్రమాదకరమంటూ జడ్జీలు వ్యాఖ్యానించారు.

‘ఈ కేసులో ఖైదీలకు విధించిన మరణ శిక్షను జీవితఖైదుకు తగ్గించారు. అలాంటప్పుడు వారిని 14 ఏండ్లకే ఎలా విడుదల చేస్తారు? ప్రభుత్వ పాలసీ ప్రకారం వారికి కల్పించిన ఈ సౌకర్యం మిగిలిన వారికి ఎందుకు కల్పించరు?’ అంటూ జస్టిస్లు బీవీ నాగరత్న, ఉజ్జుల్ భూయాన్ ప్రశ్నించారు. కొందరి విషయంలో మాత్రమే అనుకూలంగా వ్యవహరించారు. మరి మిగిలిన వారి సంగతి ఏమిటి? వారికి ఎందుకు ఈ అవకాశం కల్పించ లేదు? అసలీ పాలసీ ఎంతకాలం నుంచి అమలు చేస్తున్నారు? అది అమలవుతుంటే జైళ్లు ఇలా ఎందుకు కిక్కిరిసి ఉన్నాయి’ అని న్యాయస్థానం ప్రశ్నించింది.

అయితే ప్రశ్నలకు వివరణ కష్టతరమని, సుప్రీం కోర్టులో ఇందుకు సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉందని అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. దోషుల చట్టప్రకారమే విడుదల జరిగిందని, 1992  పాలసీ ప్రకారం రెమిషన్ కింద ముందస్తుగా వాళ్లను విడుదల చేసిందని, విడుదలకు వాళ్లు అన్ని విధాల అర్హత కలిగి ఉన్నారని ఆయన కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ.. గుజరాత్ ప్రభుత్వం తరపున నుంచి సమగ్ర సమాచారం సేకరించి కోర్టు ముందు ఉంచుతామని ఆయన విన్నవించారు.

దోషుల విడుదలపై గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని బిల్కిస్ బానో తరపు న్యాయవాది శోభా గుప్తా అన్నారు.

“ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం వినలేదు. ఇందులో కేంద్రాన్ని పార్టీగా కూడా చేర్చలేదు.. సుప్రీంకోర్టు తీర్పు దోషి రాధేశ్యామ్ దరఖాస్తుకు సంబంధించి మాత్రమే ఉంది, అయితే గుజరాత్ ప్రభుత్వం మొత్తం 11 మంది దోషులకు మినహాయింపు ఇచ్చింది. ,” ఆమె చెప్పింది.

తనకు 15 ఏళ్ల 4 నెలల జైలు శిక్ష పూర్తి అయినందున తనకు ఉపశమనం కల్పించాలని కోరుతూ దోషి రాధేషామ్ షా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని పరిశీలించి రెండు నెలల్లోగా అతనికి రిమిషన్ ఇవ్వవచ్చో లేదో తేల్చాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోర్టు కోరింది.

దీనికి ప్రతిగా గుజరాత్ ప్రభుత్వం దోషులందరినీ విడుదల చేసింది.ఇప్పటికే 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి, సత్ప్రవర్తనను ప్రదర్శించిన పురుషులను “సంస్కారీ (సంస్కృతి)” బ్రాహ్మణులుగా పేర్కొంటూ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

మరోవంక దోషుల విడుదల గురించి తనకు కనీస సమాచారం ఇవ్వలేదని బిల్కిస్ బానో పేర్కొంది. దీంతో ఆమె పిటిషన్‌పై విచారణను ఆగస్టు 24కు వాయిదా వేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles