23.7 C
Hyderabad
Monday, September 30, 2024

నేడు ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సు… తరలివచ్చిన ప్రపంచ దేశాధినేతలు!

న్యూఢిల్లీ:  జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ అంగరంగవైభవంగా ముస్తాబైంది. నేడు, రేపు రెండు రోజుల పాటు ప్రగతి మైదాన్‌లోని  భారత్ మండపంలో ఈ సదస్సు జరగబోతోంది. భారత్ తొలిసారిగా G20 సదస్సుకు ఆతిధ్యమిస్తోంది. వసుధైక కుటుంబం పేరుతో ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు నినాదంగా భారత్ ఈ సదస్సును నిర్వహిస్తోంది.

ఈ సదస్సు ద్వారా మానవాళి కేంద్రంగా సమ్మిళిత అభివృద్ధికి కొత్త దారి వేస్తామని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధంతో నెలకొన్న దారుణ పరిస్థితులు, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థలకు పరిష్కారం చూపుతూ భౌగోళికంగా ముక్కలైన రాజకీయ వాతావరణానికి సరిదిద్ది సమ్మిళిత వృద్ధి దిశగా ప్రపంచాన్ని పరుగులు పెట్టించడంపై ఈ సదస్సు దృష్టి సారించనుంది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్డ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సహా ప్రపంచ సంస్థల అధినేతలు పాల్గొంటున్న ఈ సదస్సు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. చైనా, రష్యా అమెరికాతో విభేదిస్తున్న వేళ సదస్సులో డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది.

మొదటి రోజు షెడ్యూల్

  • ఉదయం 9:30 నుండి 10:30 వరకు: శిఖరాగ్ర వేదిక, భారత్ మండపం వద్ద నాయకులు, ప్రతినిధుల రాక —
  • ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు: ‘వన్ ఎర్త్’ పేరిట మొదటి సెషన్
  • 1 pm to 3:30pm: ద్వైపాక్షిక సమావేశాలు —
  • 3:30pm నుండి 4:45pm: ‘ఒక కుటుంబం,’ పేరిట రెండవ సెషన్,
  • 7pm నుండి 8pm వరకు ప్రారంభమవుతుంది: G20 డిన్నర్ —
  • 9pm నుండి 9:45pm: ప్రతినిధి బృందం నాయకులు, ముఖ్యులు ఈ రోజును ముగించడానికి భారత్ మండపంలోని లీడర్స్ లాంజ్‌లో సమావేశమవుతారు.

 

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles