24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

అప్పుల భారతం! – కేంద్ర బడ్జెట్ 2022-23 ముఖ్యాంశాలు!

@ అప్పుల భారతం!

కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత రుణాల మొత్తం ఏకంగా 60 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ బడ్జెట్‌ విషయానికొస్తే 22-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 39.11లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని అంటే బడ్జెట్‌గా నిర్ణయించింది. చిత్రమేమిటంటో ఇందులో కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ. 19.34 లక్షల కోట్లు కాగా, నాన్‌ ట్యాక్స్ ఆదాయం రూ.2.69 లక్షల కోట్లు. ఇక ఇతర మార్గాల ద్వారా రూ. 65,000 కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అంచనా వేస్తున్నారు. మిగిలిన రూ.16.61 లక్షల కోట్లను మార్కెట్‌ నుంచి రుణాల రూపంలో తీసుకురానున్నారు. 6.4 శాతం ద్రవ్యలోటు ఉంటుందని అంటే రూ.16.61 లక్షల కోట్లు ఉంటుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. మరోలా చెప్పాలంటే ఆర్థికలోటుకు సమాన మొత్తం అప్పుల రూపేణా తీసుకు వస్తున్నారని అర్థం. నిజానికి బడ్జెట్‌లో అత్యధిక మొత్తం అంటే 35 శాతం మొత్తం అప్పుల రూపేణా కేంద్రం తెస్తోంది. మరో ముఖ్యమైన విషయమేమింటే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ. రూ.16.61 లక్షల కోట్లు అప్పుగా తెస్తే… రూ.9.40 లక్షల కోట్లు కేవలం వడ్డీ కిందే చెల్లించడానికి ఖర్చు పెట్టడం.

@ వజ్రాలు కొనేవారికి ‌ శుభవార్త

మధ్య తరగతి, పేద ప్రజల సంగతేమోగాని… వజ్రాలు కొనేవారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుభ వార్త చెప్పారు. కట్ చేసిన అలాగే పాలిష్‌ చేసిన వజ్రాలపై దిగుమతి సుంకం 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. సాధారణ సాన్‌ (పాలిష్‌ చేయని) వజ్రాలపై కస్టమ్స్‌ డ్యూటీ పూర్తిగా ఎత్తేశారు. అంటే ఎలాంటి కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించకుండా ముడి వజ్రాలు తెప్పించుకుని ఇక్కడ మీరు పాలిష్‌ పెట్టించుకోవచ్చు.

@ కొత్తగా 80 లక్షల ఇళ్ల నిర్మాణం!

కొత్తగా 80 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

@ రక్షణ రంగానికి పెద్దపీట!

బడ్జెట్లో రక్షణ రంగానికి రూ. 3,85,370 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. ఇందులో 68వ శాతం దేశీయ వనరుల నుంచి కొనుగోళ్లకు కేటాయించారు.

@ ఆదాయ పన్ను మినహాయింపులపై ఈసారీ వేతన జీవులకు తప్పని నిరాశ!
మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలను వర్గాలను బడ్జెట్ నిరాశపర్చింది. ఇన్‌కమ్ ట్యామ్స్‌ స్లాబుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అలాగే పన్ను రేట్లలో కూడా ఎలాంటి మార్పు చేయలేదు. చాలా మంది స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంచుతారని ఆశించిన వారికి నిరాశ మిగిల్చింది. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసినవారు ఏవైనా మార్పులు చేసుకోవాలంటే రెండేళ్ళలోపు చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ కింద పరిమితి పెంచడం తప్ప మరో రాయితీ లేదు.

@ ద్రవ్యలోటు తగ్గిస్తాం!

2022-23 ద్రవ్యలోటు 6.9శాతమని, దానిని 2025-26 నాటికి 4.5 శాతానికి తగ్గించడం తమ లక్ష్యమని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతంగా ఉండొచ్చని, 2022- 23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8 – 8.5 ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది.

@ బడ్జెట్‌ స్వరూపం!

2022-23 మొత్తం బడ్జెట్‌ అంచనాలు రూ.39.45 లక్షల కోట్లు.
2022-23 మూలధన వ్యయం అంచనా… రూ.10.68 లక్షల కోట్లు. ఇవి జీడీపీలో 4.1 శాతం.
2022-23 బడ్జెట్‌లో ద్రవ్య లోటు అంచనా 6.4 శాతం; 2021-22 ద్రవ్యలోటు 6.9శాతం.
2025-26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించడం లక్ష్యం
2022-23 ఆదాయ వనరులు రూ.22.84 లక్షల కోట్లు.
2022-23 జీఎస్​డీపీలో రాష్ట్రాల ద్రవ్యలోటు 4 శాతం వరకు అనుమతినిచ్చారు.

త్వరలో E-PASSPORT!
విదేశాలకు ప్రయాణాలు చేసే వారి కోసం కొత్తగా ఈ-పాస్‌పోర్ట్‌ను తీసుకువస్తున్నట్లు మంగళవారం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2019లో తొలిసారి ఈ విధానాన్ని కేంద్రం ప్రకటించినప్పటికీ అది అమలు కాలేదు. ఈ ఏడాది నుంచే వీటి జారీని ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కొత్త విధానం వల్ల ప్రయాణికులకు ఎంతో భద్రత, ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ప్రయాణాల సమయంలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సులభతరం అయ్యేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు.

భూ సంస్కరణలు!
దేశవ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్ పథకాన్ని(NGDRS) ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు ఆధునిక వ్యవస్థను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

@ త్వరలోనే ఎల్ఐసీ ప్రైవేటీకరణ!

“ఈ బడ్జెట్ వచ్చే 25 ఏళ్ల కాలానికి బ్లూప్రింట్ లాంటిది. ఎయిర్ ఇండియాను ప్రైవేటు సంస్థకు విక్రయించే ప్రక్రియ పూర్తయింది. అలాగే ఈ వ్యూహాత్మక ప్రైవేటీకరణ పథకంలో భాగంగా నీలాంచల్ ఇస్పాత్ లిమిటెడ్ ప్రైవేటు పరం చేశాం. ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియ త్వరలోనే జరుగుతుంది.

@ ఈ ఏడాది నుంచే డిజిటల్ కరెన్సీ!

“బ్లాక్వెయిన్, ఇతర సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ రూపాయిని జారీ చేస్తాం. 2022-23 నుంచే ఆర్బీఐ ఈ డిజిటల్ కరెన్సీని జారీ చేస్తుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మరింతగా ఊపునిస్తుందని ఆశిస్తున్నాం”

@ త్వరలోనే అందుబాటులోకి డిజిటల్ రూపీ!

క్రిప్టో కెరన్సీకి కౌంటర్ అన్నట్టుగానే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారత్ తరహా క్రిప్టో కరెన్సీని తీసుకొస్తున్నట్టు బడ్జెట్లో పెట్టింది. ఇండియన్ డిజిటల్ కరెన్సీని తీసుకొస్తున్నట్టు పేర్కొంది. దీన్ని త్వరలోనే RBI విడుదల చేయనుంది.

@ రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం!
రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా ఆదాయం పడిపోయి ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు వడ్డీ లేని అప్పులు ఇస్తామని తీపి కబురు చెప్పింది కేంద్రం. లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలు ఇవ్వబోతున్నట్టు పేర్కొంది.

@ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

“రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడానికి, వారిని
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తీసుకురానున్నాం. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల పన్ను మినహాయింపు పరిమితిని 10 శాతం నుండి 14 శాతానికి నుండి 14 శాతానికి పెంచుతాం. ఏదైనా వర్చువల్ డిజిటల్ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై విధించాలని ప్రతిపాదిస్తున్నాం. ఆ ఆదాయాన్ని లెక్కల్లోకి తీసుకున్నప్పుడు ఎటువంటి మినహాయింపు అనుమతించబడదు. మరోవైపు, కార్పొరేట్ సర్ఛార్జ్ 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నాం.”

@ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి స్పెషల్ స్కీమ్!

దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా వెనుకబడిన
ప్రాంతాల అభివృద్ధికి స్పెషల్ స్కీమ్ ఐటీఐల్లో ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు.

కేంద్రం, రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్తగా ఎస్ఈజెడ్లు ఏర్పాటు.

@ యానిమేషన్ రంగం సామర్థ్యం మరింత పెంపు

“యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగంలో యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. దీన్ని గుర్తించి ఆ దిశగా యువతకు ఆ మార్గాన్ని సూచిస్తున్నాం. దేశీయ యానిమేషన్ మార్కెట్.. ప్రపంచ డిమాండక్కు అనుగుణంగా సేవలందించడానికి AVGC ప్రమోషన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ఈ రంగంలో దేశీయ సామర్థ్యాన్ని మరింత పెంపొందించడానికి ఇంకా కృషి చేస్తాం”.

@ గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోనూ ఆప్టికల్ ఫైబర్ సేవలు!
“టెలికాం సెక్టర్లో 5జీ టెక్నాలజీ కోసం స్పెక్ట్రం వేలాన్ని 2022లోనే చేపడతాం. 2022 23లోనే 5జీ అందుబాటులోకి వస్తుంది. 5జీ ద్వారా ఉత్పత్తి, ఉద్యోగావకాశాలు ఇంకా పెరుగుతాయి.
అన్ని గ్రామాల్లోని ఇళ్లలో పట్టణాల తరహాలో ఈ సర్వీసులు, డిజిటల్ له సౌకర్యాలు అందాలనే ఉద్దేశంతో పని చేస్తున్నాం. ‘భారత్ నెట్ ప్రాజెక్ట్’లో భాగంగా పీపీపీ పద్ధతిలో గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోనూ ఆప్టికల్ ఫైబర్ సేవలు అందేలా చూస్తాం. ఈ ప్రాజెక్టు 2025 వరకూ పూర్తవుతుంది.”

@ నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ ఏర్పాటు

మహిళల, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, సక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 వంటి పథకాలను మా ప్రభుత్వం సమగ్రంగా పునరుద్ధరించింది. నేచురల్, జీరో-బడ్జెట్ & సేంద్రీయ వ్యవసాయం, ఆధునిక వ్యవసాయం అవసరాలను తీర్చడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల సిలబస్లు సవరించాలి.
దీని కోసం రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం.

@ టెలీ మెంటల్ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు!

టెలీ మెంటల్ హెల్త్ సిస్టం కోసం ఓ వేదిక రూపొందిస్తాం. ఇది 23 టెలీ మెంటల్ హెల్త్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నెట్వర్ను కలిగి ఉంటుంది. దీనికి నిమ్హాన్స్ నోడల్ సెంటర్ మరియు ట్రిపుల్ ఐటీ బెంగళూరు సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. మహమ్మారి అన్ని వయసుల ప్రజలలో మానసిక ఆరోగ్య సమస్యలను పెంచింది. మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్, సేవలకు మెరుగైన సౌకర్యం కోసం, జాతీయ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తాం. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) మార్చి 2023 వరకు పొడిగిస్తాం.”

@ విద్యార్థులకు శుభవార్త!

“పీఎం ఈ-విద్య ప్రోగ్రాం కింద వన్ క్లాస్-వన్ టీవీ ఛానెల్ ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 12 ఛానెళ్ల నుంచి 200 ఛానెళ్లకు పెంచుతాం. వీటి ద్వారా అన్ని రాష్ట్రాలు మంచి విద్యను వారి వారి ప్రాంతీయ భాషలో అందించవచ్చు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ పాఠాలను ఆ ఛానెళ్లలో బోధిస్తారు. హై క్వాలిటీ డిజిటల్ టీచింగ్ కంటెంట్ను డెవలప్ చేస్తాం. దీన్ని ఇంటర్నెట్ ద్వారా లేదా టీవీ ఛానెళ్ల ద్వారా, రేడియోల ద్వారా విద్యార్థులకు డిజిటల్ టీచర్ల ద్వారా చేరవేస్తాం. ఈ క్వాలిటీ కంటెంట్ తయారీ కోసం బెటర్ డిజిటల్ టూల్స్ ఉపయోగించి విద్యార్థులు సులభంగా అర్థం చేసుకొనేలా రూపొందిస్తాం. విద్యార్థులకు డిజిటల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తాం. దేశమంతా ప్రపంచ స్థాయి యూనివర్సల్ ఎడ్యుకేషన్ను అందరూ విద్యార్థులకు అందుబాటులోకి తెస్తాం.”

@ వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు!
మేకిన్ ఇండియా ద్వారా వచ్చే ఐదేళ్లలో అరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు నిర్మలా సీతారామన్. వచ్చే మూడేళ్లలో నాలుగు వందలకుపైగా వందే భారత్ రైళ్లు ట్రాక్లోకి వస్తాయి. పేద మధ్య తరగతి సంక్షేమంపై ఫోకస్ చేశామన్నారు సీతారామన్.

@ ఈ ఏడాది వృద్ధి రేటు అంచనా 9.27%… నాలుగు రంగాల అభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యం. పారదర్శక సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్ ఉపయోపడుతుంది. గృహ, వసతులు, తాగునీరు అందివ్వడంలో విజయవంతం అవుతున్నాం. త్వరలోనే ఎల్ఎస్ఐసీ పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. నీలాంచల్ నిస్పత్ నిఘమ్ లిమిటెడన్న ప్రైవేట్ పరం చేస్తాం.

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 100 సంవత్సరాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్‌లో రానున్న 25 ఏళ్ళకు బ్లూప్రింట్ ఉందని చెప్పారు. ద్రవ్య స్థితిపై పూర్తి పారదర్శకతను పాటిస్తున్నట్లు చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. తాము చేపడుతున్న చర్యలకు చెప్పుకోదగ్గ ఫలితాలు వస్తున్నాయన్నారు. స్వయం సమృద్ధి సాధించడంపై ఈ బడ్జెట్ దృష్టి పెట్టిందన్నారు. ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఆత్మ నిర్భర్ మిషన్ క్రింద 60 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందన్నారు. మూల ధన వ్యయం పెరిగిందన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాలకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం రాబోతోందన్నారు. వెనుకబడిన వర్గాలు, యువత, రైతులపై ప్రధాన దృష్టితో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles