28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

బిలియనీర్ల ఉంటున్న నగరాల జాబితాలో హైదరాబాద్‌కు 7వ స్థానం!

హైదరాబాద్: అభివృద్ధిలో దూసుకెళ్తూన్న హైదరాబాద్‌ మహానగరం  మరో ఘనతను సొంతం చేసుకుంది. బిలియనీర్ల జాబితాలో యావత్‌ దేశంలోనే ఏడో స్థానంలో నిలిచింది. భారతదేశంలోని టాప్ 100 మంది ధనవంతులలో ముగ్గురు దుబాయ్‌లో, ఇద్దరు లండన్‌లో, ఒకరు అబుదాబిలో, మిగిలిన 94 మంది బిలియనీర్లు ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ భారతీయ నగరాల్లో ఉండటానికి ఇష్టపడుతున్నారు.

ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం, ముంబైలో  అత్యధిక బిలియనీర్లు ఉన్నారు, 100 మంది ధనవంతులైన భారతీయులలో 33 మంది బిలియనీర్లు అక్కడ ఉన్నారు.

హైదరాబాద్‌లో ఎంత మంది బిలియనీర్లు ఉన్నారు?
భారతదేశంలోని 100 మంది సంపన్న వ్యక్తులలో నలుగురు బిలియనీర్లు హైదరాబాద్‌లో  నివసిస్తున్నారు.

హైదరాబాద్‌లోని బిలియనీర్ల జాబితా

  1. మురళి దీవి & కుటుంబం
  2. పి.పి. రెడ్డి & పి.వి. కృష్ణా రెడ్డి
  3. బి. పార్థసారధి రెడ్డి కుటుంబం
  4. పి.వి. రాంప్రసాద్ రెడ్డి

మొత్తంగా బిలియనీర్ల సంఖ్య ప్రకారం భారతీయ నగరాల జాబితాలో హైదరాబాద్ ఏడో స్థానంలో ఉంది.

భారతీయ నగరాల్లో నివసిస్తున్న బిలియనీర్ల జాబితా

  • ముంబై 33
  • ఢిల్లీ 20
  • బెంగళూరు 10
  • అహ్మదాబాద్ 7
  • చెన్నై 6
  • పూణే 4
  • హైదరాబాద్ 4
  • కోల్‌కతా 3
  • కొచ్చి 2
  • కోయంబత్తూరు 1
  • ఔరంగాబాద్ 1
  • గురుగ్రామ్ 1
  • హరిద్వార్ 1
  • తెన్కాసి 1

సోర్స్: ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2023

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles