23.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

కుబేరుల జాబితాలో ….’అంబానీ’, ‘అదానీ’… ‘మార్క్ జుకర్ బర్గ్‘ ను దాటేశారు!

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల జాబితాలో నిన్నటి వరకు టాప్​-10లో ఉన్న మార్క్​జుకర్​బర్గ్ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆయనకు చెందిన మెటా సంస్థ షేర్లు గురువారం రికార్డు స్థాయిలో 26శాతం పతనమయ్యాయి. దీంతో 24 గంటల్లోనే 29 బిలియన్​ డాలర్ల జుకర్​బర్గ్ సంపద ఆవిరైంది. చరిత్రలో నమోదైన అత్యంత భారీ నష్టాల్లో ఇది రెండోది కావడం గమనార్హం.
జుకర్​బర్గ్​కు సంపద భారీగా తగ్గడం వల్ల ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 12వ స్థానానికి పడిపోయారు. ఫలితంగా ఆయన అస్తుల విలువ భారత కుబేరులు అనిల్​ అంబానీ, గౌతమ్​ అదానీ కంటే తక్కువగా నమోదైంది. అంతర్జాతీయ కుబేరుల జాబితాలో 10వ స్థానంలో ఉన్న అదానీ ఆస్తులు విలువ 90.1 బిలియన్ డాలర్లు కాగా.. 11వ స్థానంలో ఉన్న అంబానీ ఆస్తుల విలువ 90 బిలియన్​ డాలర్లుగా ఉంది. జుకర్​బర్గ్​ ఆస్తుల విలువ 89 బిలియన్​ డాలర్లకే పరిమితమైంది.
గతేడాది నవంబర్​లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్​ ఒక్కరోజులనే 35బిలియన్ ​డాలర్లు పోగోట్టుకున్నారు. ఆ తర్వాత అత్యధిక నష్టం చవిచూసింది జుకర్​బర్గే కావడం గమనార్హం.ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో 232 బిలియన్​ డాలర్లతో ఎలాన్​ మస్క్​ మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బెర్నార్డ్ అర్నాల్ట్​ 193.6 బిలియన్​ డాలర్లతో రెండో స్థానంలో, జెఫ్​ బెజోస్​ 164.8 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. బిల్​గేట్స్​ 131.9 బిలియన్​ డాలర్ల సంపదతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles