24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

మిర్వాయిజ్ పిటిషన్‌పై స్పందనకు చివరి అవకాశమిచ్చిన J & K హైకోర్టు!

శ్రీనగర్: హురియత్ నాయకుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ తనపై విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యుత్తరం దాఖలు చేయడానికి జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఆ కేంద్రపాలిత ప్రాంత  ‘లెఫ్టినెంట్ గవర్నర్”కు  చివరి అవకాశం ఇచ్చింది.

తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి కోర్టు ఖరారు చేసింది.

జస్టిస్ వసీం సాదిక్ నర్వాల్, మిర్వాయిజ్ పిటిషన్‌పై ప్రత్యుత్తరం దాఖలు చేయడానికి ఒక వారం గడువు కోరుతూ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని మన్నించి, ఇదే చివరి అవకాశం” అని పేర్కొంది. “అయిష్టంగానైనా,  న్యాయం కోసం ఓ వారం గడువు ఇస్తున్నామని కోర్టు చెప్పింది.  గడువులోగా “ప్రత్యుత్తరం దాఖలు చేయకపోతే, తదుపరి విచారణ తేదీన ఈ అంశాన్ని విచారించనున్నట్లు  కోర్టు స్సష్టం చేసింది.

ఫిబ్రవరి 2న, ఫిబ్రవరి 19లోగా లేదా అంతకు ముందు సానుకూలంగా సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం జమ్ము కశ్బీర్ ప్రభుత్వాన్ని కోరింది.

ఇదిలా ఉండగా, శుక్రవారం, ఇతర ముఖ్యమైన మతపరమైన రోజులలో తనపై విధించిన ఆంక్షలకు గల కారణాలను తెలుసుకోవడానికి అంజుమన్ ఔకాఫ్ జామియా మసీదు జిల్లా అధికారులను సంప్రదించినట్లు మిర్వాయిజ్ తెలిపారు.

“నాలుగు సంవత్సరాల ఏకపక్ష గృహ నిర్బంధం నుండి సెప్టెంబర్ 2023లో నేను విడుదలైన తర్వాత, జామియా మసీదులో వరుసగా మూడు శుక్రవారం సమ్మేళనాలకు మాత్రమే హాజరయ్యేందుకు నాకు అనుమతి లభించింది. ఆ తరువాత నేను శుక్రవారం జామియా మసీదుకు వెళ్లకుండా లేదా మతపరమైన సమ్మేళనాలపై మరే ఇతర మసీదులో నా ప్రసంగాలపై నిషేధం విధించారని ఫరూక్ పిటిఐకి చెప్పారు.

చారిత్రాత్మక జామియా మసీదు మేనేజింగ్ బాడీ అంజుమన్‌ను అడ్డుకోవడానికి గల కారణాలను అడిగితే  అధికారులు ఏవో సాకులు వెదుకుతున్నారని ఆయన అన్నారు.

“మా ఉన్నతాధికారులతో మాట్లాడుతామని అంటారని,  వారు ఎప్పుడూ అలా చేయరు. ఇటీవల, షబ్ ఇ మిరాజ్  సందర్భంగా జామియా మసీదుకు వెళ్లడానికి అనుమతించలేదు, ”అని మీర్వాయిజ్ చెప్పారు.

రంజాన్ ఉపవాస మాసం సమీపిస్తున్నందున నా కోసం బహుళ మతపరమైన కార్యక్రమాల ప్రణాళిక సిద్ధమైంది. అయితే అధికారుల విధించిన  ఆంక్షల విధానం తనను ఎంతగానో కలవరపెడుతుందని  మిర్వాయిజ్ అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles