28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

నేడు రైతు సంఘాల బ్లాక్ డే…26న మహాపంచాయత్!

చండీగఢ్: పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని ఖానౌరీ సరిహద్దు క్రాసింగ్‌లో రైతు మృతి చెందిన నేపథ్యంలో  రైతులు నేడు ‘బ్లాక్ ఫ్రైడే’ పాటిస్తారని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నాయకుడు రాకేష్ టికాయత్ తెలిపారు. నిరసనల సమయంలో  SKM జాతీయ రాజధాని వైపు హైవేలపై ట్రాక్టర్ మార్చ్‌ను కూడా నిర్వహిస్తుందని BKU నాయకుడు తెలిపారు.

ఈ నెల 26వ తేదీన రైతులంతా తమ ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. అదేవిధంగా, మార్చి 14వ తేదీన ఢిల్లీలోని రామ్ లీలా  మైదానంలో మహాపంచాయత్ చేపట్టనున్నట్లు తెలిపింది. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం)లు కలిసి చేపట్టగా ఎస్ కేఎం మద్దతు మాత్రమే ఇస్తోంది. 2020-21లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాడిన ఎస్.కే.ఎం నేతలెవరూ ‘ఢిల్లీ చలో’లో పాలుపంచుకోవడం లేదు.

గురువారం ఎస్ఎం నేతలు చండీగఢ్ సమావేశమై సరిహద్దుల్లోని శంభు, ఖనౌరిల వద్ద నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఎస్ కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, జోగీందర్ సింగ్ ఉగ్రహాన్, రాకేశ్ తికాయత్, దర్శన్పాల్ మీడియాతో మాట్లాడారు. ఖగౌరి వద్ద బుధవారం జరిగిన ఆందోళనల్లో శుభకరణ్ సింగ్ అనే రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం ఖట్టర్, మంత్రిపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

వారిద్దరూ వెంటనే పదవులకు రాజీనామా చేయాలన్నారు. మృతుడి కుటుంబానికి పరిహారంగా రూ.కోటి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతడికున్న రూ.14 లక్షల రుణాలను మాఫీ చేయాలన్నారు. ఈ నెల 26వ తేదీన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తామన్నారు. ఎస్ కేఎం(రాజకీయేతర)ను కూడా కలుపుకుని పోయేందుకు చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు.

మరోవైపు హర్యానాలోని శంభు సరిహద్దులో కొనసాగుతున్న పరిస్థితులను పరిశీలించేందుకు రైతులు తమ ‘డిల్లీ చలో’ నిరసన కవాతును రెండు రోజుల పాటు నిలిపివేశారని, తదనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles