28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఖనౌరీ సరిహద్దులో మరో రైతు మృతి…మోడీ ప్రభుత్వ వైఖరిని ఖండించిన సిక్కు ప్రవాసులు!

జలంధర్: బటిండా జిల్లా అమర్‌ఘర్ గ్రామానికి చెందిన దర్శన్ సింగ్ (62) అనే వృద్ధ రైతు ఫిబ్రవరి 23న ఖానౌరీ సరిహద్దులో  గుండెపోటుతో మృతి చెందారని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి పంధేర్ తెలిపారు. ‘‘ఖనౌరీ సరిహద్దులో ఉన్న ఆయన ఈ రైతుల ఉద్యమంలో నాలుగో ‘అమరవీరుడు’.

ఫిబ్రవరి 13న రైతుల దిల్లీ చలో పిలుపు మేరకు కొనసాగుతున్న నిరసనల్లో దర్శన్ సింగ్ ఖానౌరీ సరిహద్దులో బస చేస్తున్నాడు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చట్టపరమైన హామీ, వ్యవసాయ రుణాల మాఫీ తదితర వాటి డిమాండ్‌ను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి రైతులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.

దర్శన్ సింగ్ ఇటీవలే తన కుమారుడి పెళ్లి జరిపించాడని, అతడిపై దాదాపు రూ.8 లక్షల అప్పు ఉందని తెలిసింది. వృద్ధ రైతు గురువారం రాత్రి అస్వస్థతకు గురై స్థానిక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు.

దర్శన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, దర్శన్ సింగ్ గుండెపోటుతో మృతి చెందినట్లు KMM సమన్వయకర్త సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. ‘‘రైతుల నిరసనలో దర్శన్ సింగ్ నాలుగో అమరవీరుడు. ఢిల్లీ చలో మోర్చాలో ప్రాణాలు కోల్పోయిన మరో ఇద్దరు వృద్ధ రైతుల విషయంలో వారు చేసిన విధంగానే ఆయన కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారం అందించాలి’ అని ఆయన అన్నారు.

అంతకుముందు ఫిబ్రవరి 21 న, ఖానౌరీ సరిహద్దులో నిరసన చేస్తున్న యువ రైతు శుభకరన్ సింగ్ బుల్లెట్ గాయంతో మరణించాడు. ఫిబ్రవరి 21న శుభకరన్‌సింగ్‌ మృతి చెందగా, పలువురు తీవ్రగాయాలు అయ్యాయని రైతులు ప్రకటించారు.

మరోవంక శుభకరన్ సింగ్ మరణంపై “ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే వరకు ప్రభుత్వం ఇవ్వజూపిన  ఎక్స్‌గ్రేషియాను మేము అంగీకరించమని రైతు నాయకులు తెలిపారు. .” KMM నాయకులు జగ్జీత్ సింగ్ దల్లెవాల్, సర్వన్ సింగ్ పంధేర్‌లతో కలిసి ఈ అంశంపై మీడియాను ఉద్దేశించి వారు మాట్లాడారు.

రైతు ఉద్యమకారులపై భారత ప్రభుత్వం అణిచివేతను ఖండించిన కెనడా గురుద్వారాలు.

రైతు ఉద్యమకారులపై భారతదేశం హింసాత్మక అణిచివేతను ఖండించాలని బ్రిటిష్ కొలంబియా గురుద్వారాస్ కౌన్సిల్ ప్రతినిధి బృందం కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీకి లేఖ రాసింది. అంతేకాదు పౌర హక్కులు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై కెనడాలోని భారత హైకమిషన్‌తో ఈ సమస్యను లేవనెత్తాలని ఆమెను కోరారు. భావప్రకటనా స్వేచ్ఛ,  ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తన్న  సభలను అణచివేయడానికి చేపట్టిన క్రూరమైన చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles