33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

జ్ఞానవాపి మసీద్ సెల్లార్‌లో ప్రార్థనలకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!

న్యూఢిల్లీ: జ్ఞాన్‌వాపి మసీదులోని సెల్లార్‌లో హిందూ ప్రార్థనలకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు ఈరోజు కొట్టివేసింది.
జ్ఞాన్‌వాపి మసీదు దక్షిణ సెల్లార్‌లో  ప్రార్థనలు చేయవచ్చని వారణాసి జిల్లా కోర్టు జనవరి 31న తీర్పునిచ్చింది.

వారణాన్ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని అంజుమన్ ఇంకెజామియా మసీదు కమిటీ(ఏఐఎంసీ) ‘పిటిషన్’ను జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ బెంచ్ కొట్టివేసింది. నాలుగు రోజుల పాటు పిటిషన్ పై వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ నెల 15న కోర్టు రిజర్వ్ చేసింది. మసీదు సెల్లార్లో హిందువుల పూజలకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లగా పిటిషన్ విచారించేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. దీంతో కమిటీ ఫిబ్రవరి 2న హైకోర్టుకు వెళ్లింది.

కేసు నేపథ్యం…

యూపీలోని వారణాసిలో గల కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాసి ప్రార్ధనా మందిరం విషయంలో యాజమాన్య హక్కుల కోసం కొన్నేళ్లుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మసీదు ప్రాంగణంలో ఉన్న దేవతామూర్తులను ఆరాధించడానికి అనుమతివ్వాలంటూ కొంతమంది మహిళలు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. దీని పై గతంలో విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. సీల్ చేసిన ఉజూఖానా మినహా.. మసీదు ప్రాంగణమంతా కార్బన్ డేటింగ్ ఇతర పద్ధతులతో భారత పురావస్తు విభాగం(ASO సర్వే చేసిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 1993 వరకు తన తాత సోమనాథ్ వ్యాస్ ప్రార్థనలు చేశారని శైలేంద్ర కుమార్ పాఠక్ పిటిషన్‌పై ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. వంశపారంపర్య పూజారిగా తనను సెల్లార్ ప్రవేశించి పూజను పునఃప్రారంభించేందుకు అనుమతించాలని మిస్టర్ పాఠక్ అభ్యర్థించారు.

మసీదులో నేలమాళిగలో నాలుగు ‘తెహ్ఖానాలు’ (సెల్లార్లు) ఉన్నాయి. వాటిలో ఒకటి ఇప్పటికీ వ్యాస్ కుటుంబంతో ఉంది.

ఈ కేసుకు సంబంధించి అదే కోర్టు ఆదేశించిన ASI సర్వే, హిందూ దేవాలయ అవశేషాలపై ఔరంగజేబు పాలనలో మసీదు నిర్మించారని సూచించింది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles