24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

ముస్లిం వివాహా చట్టం రద్దుకు నిరసనగా అస్సాం అసెంబ్లీ నుంచి ప్రతిపక్షాల వాకౌట్!

గౌహతి: అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం-1935ను రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ సోమవారం అస్సాం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి.

కేబినెట్ నిర్ణయంపై చర్చించేందుకు ఏఐయూడీఎఫ్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, స్పీకర్ బిశ్వజిత్ డైమరీ దానిని తిరస్కరించారు. అసలు బిల్లును పూర్తిగా రద్దు చేయకుండా సవరణలు చేయవచ్చని కాంగ్రెస్ సమర్థించింది.

రాష్ట్రంలో బాల్య వివాహాల సామాజిక విపత్తును అంతం చేసే క్రమంలో ఈ చట్టాన్ని రద్దు చేసే నిర్ణయానికి అస్సాం కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.

ప్రతిపక్ష పార్టీల విమర్శలపై శర్మ స్పందిస్తూ… బాల్య వివాహాల నిర్మూలన దిశగా బిల్లును రద్దు చేస్తామని సోమవారం సభలో నొక్కి చెప్పారు. నేను జీవించి ఉన్నంత వరకు అస్సాంలో బాల్య వివాహాలను అనుమతించను.

కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ 10 నిమిషాల పాటు సభ నుంచి వాకౌట్ చేసింది. AIUDF శాసనసభ్యులు మొదట్లో నినాదాలు చేస్తూ వెల్‌ ఆఫ్‌ ద హౌస్‌లోకి దూసుకెళ్లి, ఐదు నిమిషాలకు పైగా నేలపైనే కూర్చున్నారు. స్పీకర్ సభా కార్యకలాపాలను కొనసాగించడంతో వారు కూడా వాకౌట్ చేశారు. అయితే ప్రతిపక్ష సీపీఐ(ఎం) శాసనసభ్యుడు, ఏకైక స్వతంత్ర ఎమ్మెల్యే సభలోనే ఉన్నారు.

ముస్లిం వివాహ చట్టం రద్దుతో వచ్చే మార్పులేంటి?

ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం.. ముస్లింలు వివాహాలు, విడాకులను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చు. అటువంటి విషయాలపై కేసులను నమోదు చేయడం చట్టం ప్రకారం తప్పనిసరి కాదు. ఈ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత సమాజంలో వివాహాలు, విడాకులు నమోదు చేయడానికి లైసెన్స్‌లను కలిగి ఉన్న ముస్లిం రిజిస్ట్రార్లు.. ఇకపై ఆ హక్కుని కోల్పోతారు.

అస్సాంలో మొత్తం 94 ముస్లిం రిజిస్ట్రార్‌లు ఉన్నాయని.. ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత వాళ్లకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి బారుహ్ హామీ ఇచ్చారు. చట్టాన్ని రద్దు చేశాక.. జిల్లా కమీషనర్లు, జిల్లా రిజిస్ట్రార్‌లు ‘రిజిస్ట్రేషన్ రికార్డుల కస్టడీ’ని కలిగి ఉంటారు. ఇకపై రిజిస్ట్రేషన్‌లు అస్సాం ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పర్యవేక్షణలో జరుగుతాయి.

ప్రస్తుతం అమల్లో ఉన్న ముస్లిం వివాహ చట్టంలోని కొన్ని నిబంధనలు.. వధువు(18), వరుడు(21) లీగల్ ఏజ్‌‌కి చేరుకోకపోయినా వివాహాలను నమోదు చేసుకోవడానికి అనుమతిస్తాయి.  ఇప్పుడు అస్సాంలోని హిందువులు, ముస్లింలకు ఒకే చట్టం ఉండనుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles