23.7 C
Hyderabad
Monday, September 30, 2024

బిజెపి పాలిత రాష్ట్రాల్లో కలవరపెడుతున్నముస్లిం వ్యతిరేక వి ద్వేష ప్రసంగాలు…ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక!

మన దేశం 2023లో ముస్లిం వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగాల ఉప్పెనను చవిచూసింది. ఇటువంటి ఘటనలు సగటున రోజుకు దాదాపు రెండు జరిగాయని వాషింగ్టన్ DCలోని ప్రసిద్ధ పరిశోధనా బృందం ఇండియా హేట్ ల్యాబ్ (IHL) విడుదల చేసిన నివేదిక ప్రకారం తేలింది.  ఈ విద్వేషపూరిత ప్రసంగాల్లో 75 శాతం ఘటనలు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలిత రాష్ట్రాల్లోనే జరిగాయని నివేదిక వెల్లడించింది.

ఈ ద్వేషపూరిత ప్రసంగాలు ఆగస్టు – నవంబర్ మధ్య గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో  నాలుగు ప్రధాన రాష్ట్రాలలో ఎన్నికలు జరగడం విశేషం. ఎన్నికల లాభాల కోసం మతపరమైన ఉద్రిక్తతలను ఉపయోగించుకునేందుకు వీలుగా…  విద్వేష ప్రసంగాలు కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకునే సాగటం శోచనీయమని నివేదిక చెబుతోంది.

సోషల్ మీడియా, రాజకీయ ర్యాలీలు, ప్రధాన మీడియా సంస్థలతో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో భారతీయ ముస్లింలను ఉద్దేశించి విద్వేషపూరిత ప్రసంగాలు జరిగినట్లు ఇండియా హేట్ ల్యాబ్ (IHL) నమోదు చేసింది. ఈ ద్వేషపూరిత ప్రసంగాలు తరచుగా ముస్లింలను రాక్షసులుగా చూపుతూ… వివక్షాపూరిత వైఖరిని ప్రోత్సహించాయి.

కొందరు రాజకీయ వ్యక్తులు, కొన్ని తీవ్రవాద సమూహాలు ముస్లింలను తిట్టడానికి,  వారి స్వంత ఎజెండాలను ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరం ఉద్రేకపూరిత వాక్చాతుర్యాన్ని ఉపయోగిస్తున్నాయని ఇండియా హేట్ ల్యాబ్ (IHL) పరిశోధనలో తేలింది.. మతపరమైన ఉద్రిక్తతలను ఉపయోగించుకోవడం, మతవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ శక్తులు ముస్లింల పట్ల హింస, వివక్షను మరింతగా కొనసాగించేలా చేశాయి. ఇది దేశ సామాజిక ఐక్యత, ప్రజాస్వామ్య విలువలను బలహీనపరుస్తుంది.

భారతీయ ముస్లింల జీవితాలు, వారిశ్రేయస్సుపై ద్వేషపూరిత ప్రసంగాలు హానికరమైన ప్రభావాన్ని చూపాయని ఇండియా హేట్ ల్యాబ్ (IHL) తేల్చింది. అంతేకాదు ముస్లిం సమాజాలపై హింసకు పాల్పడేలా ప్రోత్సాహమిచ్చినట్లైంది. తద్వారా భారతీయ సమాజంలో ముస్లింలు  అట్టడుగు స్థితికి చేరేలా చేశాయి.

విద్వేష ప్రసంగాలను డాక్యుమెంట్ చేయడంతో పాటు, వీటి కారణంగా ఏర్పడే సామాజిక-రాజకీయ మార్పులను కూడా ఇండియా హేట్ ల్యాబ్ (IHL) విశ్లేషించింది. పెరుగుతున్న మతపరమైన జాతీయవాదం, మీడియా కవరేజీ, ద్వేషపూరిత నేరాలకు పాల్పడేవారికి శిక్ష విధించబడకపోవడం వంటి అంశాలు భారతదేశంలో ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్  విస్తరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాయి.

ఇండియా హేట్ ల్యాబ్ (IHL) పరిశోధన ద్వేషపూరిత ప్రసంగాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రస్తుతు ఉన్న చట్టాలను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది.  భారత శిక్షాస్మృతి (IPC), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనలు..  ద్వేషపూరిత ప్రసంగాలను అడ్డుకునేందుకు భారతదేశంలో చట్టాలు ఉన్నప్పటికీ, వాటి అమలు తీరు సరిగ్గా లేకపోవడంతో నేరస్థులు తరచుగా శిక్ష నుండి తప్పించుకుంటున్నారు.

భారతీయ సమాజంలో పరమతసహనాన్ని ప్రోత్సహించడానికి సరైన చర్యలు చేపట్టాలని ఇండియా హేట్ ల్యాబ్ (IHL) కోరుకుంటోంది. ఇందులో భాగంగా మీడియా సంస్థలు తమ పత్రికల్లో సమగ్ర కథనాలకు ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది. విధాన రూపకర్తలు, పౌర సమాజ సంస్థలు,  సామాజిక కార్యకర్తలు ద్వేషపూరిత ప్రసంగాల వ్యాప్తిని తగ్గించడంలో సాయపడాలి.

మొత్తంగా 2023లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని 668 ద్వేషపూరిత ప్రసంగ సంఘటనలను ఇండియా హేట్ ల్యాబ్ (IHL) నమోదు చేసింది. 2023 మొదటి అర్ధ భాగంలో 255 ఘటనలు జరిగినట్లు రికార్డు చేసింది.  అయితే రెండవ అర్ధభాగంలో ఈ సంఖ్య 62% పెరుగుదలతో 413 ఘటనలు చోటుచేసుకున్నాయి.

భారతీయ జనతా పార్టీ (బిజెపి) పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు , జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిటి) ఢిల్లీలోనే 498 (75%) సంఘటనలు జరిగినట్లు ఇండియా హేట్ ల్యాబ్ (IHL)  గణాంకాలు చెబుతున్నాయి.

అత్యధిక విద్వేషపూరిత ప్రసంగాలు జరిగిన మొదటి ఎనిమిది రాష్ట్రాల్లో, ఆరింటిని ఏడాది పొడవునా బీజేపీ పాలించింది. మిగిలిన రెండు రాష్ట్రాలు 2023లో శాసనసభకు ఎన్నికలు నిర్వహించి, ఏడాదిలో కొంత కాలం బీజేపీ పాలనలో ఉన్నాయి.

239 (36%) సంఘటనలు ముస్లింలపై ప్రత్యక్ష హింసకు పిలుపునిచ్చాయి. ఈ ప్రమాదకరమైన ప్రసంగాలలో 77% బిజెపి పాలిత/పాలించే రాష్ట్రాలలోనే చోటుచేసుకున్నాయి.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో అనుబంధంగా ఉన్న విశ్వహిందూ పరిషత్-బజరంగ్ దళ్ 216 (32%)  ద్వేషపూరిత ప్రసంగాలతో  అగ్రగామిగా నిలిచింది. మొత్తంమీద, 307 (46%) విద్వేషపూరిత ప్రసంగ కార్యక్రమాలు విస్తృత సంఘ్ పరివార్ (RSS కుటుంబం)లో భాగమైన సంస్థలే చేశాయని ఇండియా హేట్ ల్యాబ్ (IHL) పరిశోధనలో తేలింది.

100 (15%) ఈవెంట్‌లలో బీజేపీ నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారు. బిజెపి శాసనసభ్యుడు టి రాజా సింగ్ మాట్లాడారు.

మహారాష్ట్ర (118), ఉత్తరప్రదేశ్ (104), మధ్యప్రదేశ్ (65) ద్వేషపూరిత ప్రసంగాల ఘటనల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. నమోదైన మొత్తం ద్వేషపూరిత ప్రసంగాల్లో ఈ మూడు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏకంగా 43% వాటాను కలిగి ఉన్నాయి.

2024లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో 186 (28%) సంఘటనలు జరిగాయి. వీటిలో ఎక్కువ సంఘటనలు మహారాష్ట్రలో జరిగాయి.

హిందూ తీవ్రవాద ప్రభావశీలి కాజల్ హిందుస్తానీ, అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ (AHP) చీఫ్ ప్రవీణ్ తొగాడియా,  హిందూ రాష్ట్ర సేన చీఫ్ ధనంజయ్ దేశాయ్, తెలంగాణ బిజెపి శాసనసభ్యుడు టి రాజా సింగ్, ద్వేషపూరిత ప్రసంగాలకు ఆద్యులు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles