24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

జెఎన్‌యులో వామపక్ష కూటమి ఘన విజయం… 30 ఏళ్ల తరువాత దళిత అధ్యక్షుడు!

న్యూఢిల్లీ:  జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) విద్యార్థి సంఘ ఎన్నికల్లో వామపక్ష కూటమి ఘన విజయం సాధించింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వామపక్ష మద్దతు ఉన్న గ్రూపులు తమ మొదటి దళిత అధ్యక్షుడిని ఎన్నుకోవడం విశేషం.

జెఎన్‌యు విద్యార్థి సంఘ ఎన్నికల్లో  అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో పాటు సహాయ కార్యదర్శి పదవితో కూడిన సెంట్రల్‌ ప్యానెల్‌ను ఎస్‌ఎఫ్‌ఐ కూటమి క్లీన్‌స్వీప్‌ చేసింది. బిజెపి అనుబంధ ఎపిబివి మట్టికరిపించింది.

నాలుగేళ్ల విరామం తర్వాత జరిగిన ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఉమేష్ సి అజ్మీరాపై 1676 ఓట్లు సాధించి అఖిల భారతీయ విద్యార్థి సంఘం (ఏఐఎస్‌ఏ)కు చెందిన ధనంజయ్ 2,598 ఓట్లతో జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు.

ధనంజయ్ బీహార్‌లోని గయాకు చెందినవాడు. అంతేకాదు 1996-97లో ఎన్నికైన బట్టి లాల్ బైర్వా తర్వాత వామపక్షాల నుండి వచ్చిన మొదటి దళిత అధ్యక్షుడు.

గెలుపు అనంతరం ధనంజయ్ పిటిఐతో మాట్లాడుతూ, “ఈ విజయం  ద్వేషం, హింసాత్మక రాజకీయాలను జెఎన్‌యు విద్యార్థులు తిరస్కరించడానికి రెఫరెండం అని అన్నారు. విద్యార్థులు మరోసారి మాపై తమ నమ్మకాన్ని చూపించారు. మేము వారి హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాము.  విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై పని చేస్తామని ఆయన అన్నారు.

అంతేకాదు “క్యాంపస్‌లో మహిళల భద్రత, నిధుల కోతలు, స్కాలర్‌షిప్ పెంపు, మౌలిక సదుపాయాలు,  నీటి సంక్షోభం మా ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటి” అని ఆయన చెప్పారు.

‘లాల్ సలామ్’, ‘జై భీమ్’ నినాదాల మధ్య, విజేతలైన విద్యార్థులను వారి మద్దతుదారులు అభినందించారు. అభ్యర్థుల గెలుపునకు విద్యార్థులు ఎరుపు, తెలుపు, నీలం రంగులతో జెండాలు చేతబూని సంబరాలు చేసుకున్నారు.

స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) నుండి అవిజిత్ ఘోష్ 927 ఓట్ల తేడాతో ABVP దీపికా శర్మను ఓడించి ఉపాధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. ఘోష్‌కి 2,409 ఓట్లు రాగా, శర్మకు 1,482 ఓట్లు వచ్చాయి.

వామపక్షాల మద్దతుతో బిర్సా అంబేద్కర్ ఫూలే స్టూడెంట్స్ అసోసియేషన్ (బాప్సా) అభ్యర్థి ప్రియాంషి ఆర్య 926 ఓట్ల తేడాతో ఏబీవీపీకి చెందిన అర్జున్ ఆనంద్‌ను ఓడించి ప్రధాన కార్యదర్శి పదవిని గెలుచుకున్నారు. ఆర్యకు 2,887 ఓట్లు రాగా, ఆనంద్‌కు 1961 ఓట్లు వచ్చాయి.

జాయింట్ సెక్రటరీగా ఏబీవీపీకి చెందిన గోవింద్ డాంగిపై 508 ఓట్ల తేడాతో లెఫ్ట్‌కు చెందిన మహ్మద్ సాజిద్ విజయం సాధించారు. మొత్తం నలుగురు విజేతలలో అతనిది అత్యల్ప మెజారిటీ.

మొత్తంగా  42 మంది కౌన్సలర్లలో 30 మంది ఎస్‌ఎఫ్‌ఐ కూటమికి చెందినవారు. వామపక్ష పానెల్ గెలుపొందడంతో, JNU వామపక్ష కంచుకోటగా దాని రికార్డును నిలబెట్టుకుంది. ABVP నెక్ అండ్ నెక్ ఫైట్ ఇచ్చింది, ప్రారంభ ట్రెండ్‌లలో నాలుగు సెంట్రల్ ప్యానెల్ పోస్ట్‌లలో ముందంజలో ఉంది.

యునైటెడ్ లెఫ్ట్ ప్యానెల్‌లో

వామపక్ష విద్యార్థి కూటమిలో ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎ, డిఎస్‌ఎఫ్‌, ఎఐఎస్‌ఎఫ్‌లు సభ్యులుగా ఉన్నాయి.  దీనిని AISA గా వ్యవహరిస్తున్నారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles