33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

మణిపూర్ పరిస్థితిని చక్కదిద్దటంలో రాజకీయాలు ఇమిడి ఉన్నాయి: బిమోల్ అకోయిజం!

అంగోమ్చా బిమోల్ అకోయిజం… న్యూ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో  సామాజిక, రాజకీయ మనస్తత్వశాస్త్ర ఆచార్యులుగా పనిచేస్తున్నారు. 57 ఏళ్ల విద్యావేత్త మణిపూర్‌కు చెందిన కొద్దిమంది ప్రముఖుల్లో ఒకరుగా ఉన్నారు, వీరు మైటీస్,కుకీలకు సంబంధించిన వివాదాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా చాలా సార్లు తన గొంతు వినిపించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇన్నర్ మణిపూర్ నుండి కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా డక్కన్ హెరాల్డ్ వార్తా పత్రిక ప్రతినిధితో  మణిపూర్ పరిస్థితి, ఎన్నికల్లో పోటీకి కారణాలేంటి వంటి పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
  • ఎన్నికల్లో పోటీ చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ఏమిటన్న ప్రశ్నకు సమాధానమిస్తూ…

గత 11 నెలల్లో మణిపూర్‌లో సంభవించిన సంక్షోభం కనీవిని ఎరగనిది.  ప్రజలు తుపాకులతో తిరగడం లాంటి  విపరీత పరిస్థితులు భారతదేశ చరిత్రలో ఎక్కడా చూడలేదు. ఇది అంతర్యుద్ధం,  దీని కేంద్రం  అసమర్థత ఎంతమాత్రం కాదు, సంక్షోభాన్ని నియంత్రించడానికి రాజ్యాధికారాన్ని ఉపయోగించటానికి వారు ఇష్టపడకపోవడమే ఈ దుస్థితి కారణం కాబట్టి, మొత్తం వ్యవహారంలో ఏదో రాజకీయం ఉందని నేను అనుమానిస్తున్నాను. అమాయకుల ప్రాణాలు పోయాయి, ఇళ్లు తగలబడ్డాయి, ప్రజలు నిర్వాసితులు అయ్యారు,  శరణార్థుల్లా తిరుగుతున్నారు. కాబట్టి ఒక పౌరుడిగా, నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడాను, కానీ ఇప్పుడు పార్లమెంటు లోపల నా అభిప్రాయాలను వెల్లడించే సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను.

  • వివాదాన్ని కేంద్రం ఇష్టపూర్వకంగా నియంత్రించలేదని చెబుతున్నారా అన్న ప్రశ్నపై మాట్లాడుతూ…

ఇలా జరగడానికి కేంద్రం ఉద్దేశపూర్వకంగా అనుమతించిందని నేను పార్లమెంటు భవనం లోపల చెప్పాలనుకుంటున్నాను. దేశంగా మనం విఫలం కాలేదు,  కానీ మణిపూర్‌ని విఫల రాష్ట్రంగా మార్చాం. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ కాదు,  రువాండా కాదు. మాలో కొంతమంది ప్రధానిని కలవడానికి వెళ్లాలనుకున్నాం.. కానీ అపాయింట్‌మెంట్ దొరకలేదు. ప్రధాని జూన్ 3న ఒడిశా వెళ్లి రైలు ప్రమాద బాధితులను పరామర్శించారు.  ఆ తరువాత గుజరాత్‌లో వంతెన కూలి ఏడుగురు మరణించిన సమయంలో ప్రధాని అక్కడే ఉన్నారు. ఆయన దేశం మొత్తానికి ప్రధాని కాదా? ఈ సంక్షోభ సమయంలో ఒక్కసారి కూడా మణిపూర్‌కు ఎందుకు రాలేదు? మణిపూర్‌లో ఇలాంటి సంక్షోభం ఎన్నడూ చూడలేదు. ఒక వర్గం ఇంఫాల్‌కు రాలేరు, మరొక సంఘం బిష్ణుపూర్ దాటి వెళ్లదు. ఇది 1984లో పంజాబ్ లేదా గుజరాత్ అల్లర్లలో జరిగిన హింస కంటే దారుణమని ప్రొఫెసర్ అకోయిజం వాపోయారు.

  • ఓటర్లకు మీరిచ్చే సందేశం ఏమిటన్న విషయంపై మాట్లాడుతూ…

నేను వాగ్దానాలు చేయను. నేను బయట నిలబడి అరవడం కాకుండా పార్లమెంటు లోపల మాట్లాడి మణిపూర్ సమస్యలను ప్రస్తావిస్తానని మాత్రమే ప్రజలకు చెబుతున్నాను. ఇదే విషయాన్ని ఎంపీగా చెబితే మరింత పెద్ద ప్రభావం ఉంటుంది. దీన్ని సాధారణ ఎన్నికలుగా తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మణిపూర్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేంద్రం వైపు చూస్తోంది. కానీ, మీ ప్రధాని మరో వైపు చూస్తున్నారని ఆయన అన్నారు.

  • ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గంలో మెయిటీలు మెజారిటీగా ఉన్నారు. NRC అమలు మరియు ST హోదా పొందడం వంటి వారి ప్రధాన డిమాండ్లపై ఆయన తన అభిప్రాయం వెల్లడిస్తూ…

మణిపూర్‌లో అక్రమ వలసదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారని అనుమానిస్తున్నారు. అక్రమ వలసదారుల భావన ప్రజల్లో అంతర్లీనంగా ఉంది, మనకు పౌరుల భావన లేకపోతే, మనకు అక్రమ వలసదారుల భావన కూడా ఉండదు. అందువల్ల మయన్మార్‌తో మన సరిహద్దులకు దగ్గరగా ఉన్న కొత్త గ్రామాల సంఖ్యపై చాలా సందేహాలు ఉన్నాయి, ముఖ్యంగా కుకీల విషయంలో ఒకప్పుడు కుకీలకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, నాగాలకు 12 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు, ఇప్పుడు ఇరువైపులా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్య 12-12 ఉండవచ్చు. చండేలా  తెంగ్నౌపాల్ సాంప్రదాయకంగా నాగా చేతిలో ఉండేవారు. కానీ చందేల్, తెంగ్నౌపాల్ కుకీస్‌కి వెళ్లాలని మనం ఆశించవచ్చు. కుకీ ప్రజల జనాభా అసాధారణంగా పెరుగుతోంది, వారిలో చాలా మంది పొరుగున ఉన్న మయన్మార్ నుండి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. కానీ ఆ  భయాన్ని తొలగించడానికి కుక్కీలు ఏమీ చేయలేదు.  భారత పౌరుడు విదేశీ వ్యక్తి మధ్య వ్యత్యాసం ఉండాలని ప్రజలందరూ అంగీకరిస్తారు. లేకుంటే బంగ్లాదేశ్ నుంచి బెంగాలీలందరినీ, నేపాల్ నుంచి నేపాలీలనీ, లాహోర్ నుంచి పంజాబీలందరినీ పిలిపిస్తారు. మీకు జాఫ్నాలో తమిళులు ఉన్నారు, వారందరినీ తమిళనాడుకు రావడానికి అనుమతిస్తారా? NRC విషయానికొస్తే, ఆందోళనలను పరిష్కరించడానికి అన్ని సమస్యలను చర్చించాలని నేను భావిస్తున్నానని ఆయన అన్నారు.  సూత్రప్రాయంగా, పౌరుడు మరియు పౌరుడు కాని వ్యక్తి మధ్య తేడాను గుర్తించే యంత్రాంగానికి నేను అనుకూలంగా ఉన్నాను.

  • మెయిటీలకు ఎస్టీ డిమాండ్ అంశంపై మాట్లాడుతూ….

మెయిటీస్ చాలా కాలంగా ఈ అభద్రతా భావంతో బాధపడుతున్నారు. ఇది కనీసం 1970 ల నుండి ఉంది. అస్సాంలో లాగా, ఇక్కడ కూడా మెయిటీస్‌లో కూడా విదేశీయుల సెంటిమెంట్ మాకు ఉంది. కాబట్టి, వారు రాజ్యాంగ రక్షణను కోరుతున్నారు. ఎస్టీ డిమాండ్‌పై చర్చించవచ్చు. అదే సమయంలో కేంద్రం మెయిటీస్‌కు సంబంధించిన సామాజిక, సామాజిక వర్గీకరణను కోరటం గందరగోళం సృష్టిస్తోందని అన్నారు.

  • కుకీల ప్రత్యేక పరిపాలన కోసం డిమాండ్ పెరుగుతోందన్న అంశానికి సంబంధించి తన అభిప్రాయాలను వెల్లడిస్తూ….

ఇది పూర్తిగా  తిరోగమన ఆలోచన. దళితులకు, సిక్కు వర్గాలకు ప్రత్యేక పరిపాలన ఇవ్వండి అని చెబితే మనం అలా చేస్తామా? 1956లో, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిటీ భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది, అయితే ఈశాన్యంలో వారు జాతి ప్రాతిపదికన చేశారని ప్రోఫెసర్ అకోయిజం తన అభిప్రాయాలను వార్తా ప్రతినిధితో పంచుకున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles