23.7 C
Hyderabad
Monday, September 30, 2024

ప్రధాని నోట మరో ‘జుమ్లా’…ముస్లింలపై విద్వేష ప్రచారం చేయలేదన్న మోదీ!

వారణాసి: ఇటీవల ఒక ప్రసంగంలో ముస్లింలు ‘చొరబాటుదారులు’,’ఎక్కువ మంది పిల్లలు’ కంటారని అని తాను ఎప్పుడూ చెప్పలేదని మోడీ పేర్కొన్నారు. ముస్లింలను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చొరబాటుదారులు దేశ సంపదను ఎక్కువ పిల్లలు ఉన్నవారికి’ పంచుతుందని ఏప్రిల్ 21న రాజస్థాన్‌లోని బన్‌స్వారాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు కామెంట్ చేశారు. ప్రధాని  చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై మోదీ స్పందన తెలుసుకునేందుకు ప్రధానితో న్యూస్ 18 ప్రత్యేక ఇంటర్వూ చేసింది. రాజకీయంగా దుమారం రేపిన ప్రధాని వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకున్నారు.ఎ క్కువ మంది పిల్లలను కలిగి ఉన్న వ్యక్తుల గురించి ఎందుకు మాట్లాడారు? అది తప్పుగా అనిపించలేదా అని ప్రశ్నిస్తే ఆయన తన వ్యాఖ్యలను వివరణ ఇచ్చారు.

తాను ముస్లింల గురించి మాత్రమే మాట్లాడలేదన్నారు. ప్రతి పేద కుటుంబం గురించి మాట్లాడానని తెలిపారు. ప్రధాని మోదీ కూడా ‘నేను హిందువు, ముస్లిం అని అనలేదు.. హిందూ-ముస్లింల గురించి మాట్లాడటం మొదలుపెట్టిన రోజు రాజకీయాలు చేయడం మానేస్తానంటూ స్పష్టం చేశారు. అందరినీ సమానంగా చూస్తానని ..ఇది తన తీర్మానం అని న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు.

‘మీరు ముస్లింలకు వ్యతిరేకం కాదనేన అభిప్రాయాన్ని ఎందుకు ఖండించలేకపోయారు?’ అని ప్రధాని మోదీని ప్రశ్నించగా.. ‘ఇది ముస్లిం ప్రశ్న కాదు. వ్యక్తిగతంగా ముస్లింలు నన్ను ఇష్టపడవచ్చు కానీ 2002 తర్వాత నా ప్రతిష్ట మసకబారింది. ‘ముస్లింల ప్రేమను నేను మార్కెట్ చేయను’ అని కూడా ప్రధాని మోదీ అన్నారు.

మొత్తంగా మోడీ బహిరంగంగా చేసిన మతపరమైన వ్యాఖ్యలు విశ్వగురు ప్రతిష్ఠను దెబ్బతీశాయి, ఈ వ్యాఖ్యలపై మన మీడీయాలో తీవ్ర విమర్శలొచ్చాయి. అయితే ప్రపంచ మీడియా కూడా ఈ వ్యాఖ్యలను ఖండించడం మోడీకి మరింత ఆందోళన కలిగించే విషయం.

న్యూయార్క్ టైమ్స్ ఇలా చెప్పింది: ముస్లింలను లక్ష్యంగా చేసుకున్న మోడీ భాష విశ్వగురువుగా  ప్రపంచ వేదికపై కనిపించే ఆయన ప్రతిరూపానికి భిన్నంగా ఉందని పేర్కొంది.

ఆ వ్యాఖ్యలు వెనక్కు తగ్గడంతోపాటు కొంత మంది ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా మారడం వల్ల కూడా వెనకడుగు వేసి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడ్డారు.

భారతీయ ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు మోడీపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘం ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మరియు సాధారణ పౌరుల నుండి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు.  దీంతో మోడీ కొంత వెనక్కి తగ్గి ఉండచ్చంటున్నారు.

ఏది ఏమైనప్పటికీ, ప్రధాని నిజంగా ముస్లింలని అన్నారనడానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయి.  కాబట్టి  మోడీపై కఠినమైన చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోకుండా ఎన్నికల సంఘం లేదా సుప్రీం కోర్టును నిరోధించకూడదు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles