30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

రాహుల్, అఖిలేష్ సభలో తొక్కిసలాట… ప్రసంగించకుండానే వెళ్లిపోయిన నేతలు!

ప్రయాగ్‌రాజ్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పాల్గొన్న ఉమ్మడి ఎన్నికల సభలో ఇరువురు నేతలు ప్రసంగించకుండా మధ్యలోనే వెళ్లిపోయారు.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ర్యాలీకి హాజరయ్యేందుకు కాంగ్రెస్, ఎస్పీ మద్దతుదారులు అనేక మంది వేదిక వద్దకు చేరుకున్నారు. యాదవ్ వేదిక వద్దకు రాగానే, వేదిక ముందు నిలబడిన జనం బారికేడ్లను ఛేదించుకుని అక్కడికి చేరుకోవడంతో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు.

సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్ రెండింటి అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో అప్‌లోడ్‌ చేసిన వీడియో క్లిప్‌లో, వేదికపై ఉన్న వ్యక్తులు మద్దతుదారులను వెనక్కి వెళ్లమని కోరడం వినవచ్చు. అయినా వేదికపై నుంచి చేసిన విజ్ఞప్తులు ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి.

అప్పుడు రాహుల్ గాంధీ, అఖిలేష్  యాదవ్ తమ భద్రతా సిబ్బంది రక్షణగా నిలబడ్డారు. కొద్ది క్షణాల తర్వాత ప్రసంగించకుండానే వేదిక దిగిపోయారు.   ఫుల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీ చేస్తున్న అమర్‌నాథ్ మౌర్యకు అనుకూలంగా ఉమ్మడి ర్యాలీ నిర్వహించారు.

భద్రతా అధికారుల సలహా మేరకు  యాదవ్, గాంధీ ర్యాలీలో ప్రసంగించకూడదని నిర్ణయించుకున్నారని సమాజ్ వాదీ పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మరో ఎన్నికల ర్యాలీకి వీరిద్దరూ హాజరయ్యారు.

ఈ ర్యాలీపై ఎస్పీ కానీ, కాంగ్రెస్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్ పిటిఐని సంప్రదించినప్పుడు, “నేను వారణాసిలో ఉన్నాను, ఫుల్‌పూర్‌లో ర్యాలీ గురించి ఎటువంటి సమాచారం లేదు” అని అన్నారు.

ఇదీ జరిగింది
రమణ్​ సింగ్​ను ప్రయాగ్​రాజ్ లోక్​సభ స్థానం నుంచి బరిలోకి దింపింది ఇండియా కూటమి. రమణ్​ సింగ్​ కోసం ప్రచారం చేసేందుకు ఆదివారం రాహుల్​ గాంధీ, అఖిలేశ్​ యాదవ్ ప్రయాగ్​రాజ్​ చేరుకున్నారు. హెలికాప్టర్​లో బహిరంగ సభ ప్రాంతానికి వచ్చారు. అనంతరం పోడియం పైకి ఎక్కి ప్రసంగం మొదలు పెట్టారు.

ఈ క్రమంలో భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, మద్దతుదారులు భద్రతా వలయాన్ని ఛేదించారు. బారికేడ్లను తోసుకుంటూ పోడియం వైపు దూసుకొచ్చారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను సైతం పక్కకు నెట్టేసి వీరంగం సృష్టించారు. దీంతో అక్కడ తొక్కసలాట వంటి పరిస్థితి ఏర్పడింది.

దీంతో వేదికపై కూర్చున్న అఖిలేశ్ యాదవ్ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేసినా మద్దతుదారులు వినిపించుకోలేదు. రాహుల్​ మాట కూడా వినలేదు. దీంతో పూర్తిగా ప్రసంగించకుండానే ఇరువురు నేతలు వెనుదిరిగారు. అయితే కూటమికి వస్తున్న ప్రజాదరణ చూసి బీజేపీ మతిపోయిందని, అందుకే కుట్రలో భాగంగా సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని స్థానిక నేతలు ఆరోపించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles