33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

సర్వశక్తులు ఒడ్డినా… ‘టార్గెట్ 370’ని రీచ్ కావడంలో విఫలమైన బీజేపీ!

న్యూఢిల్లీ: ఈ  లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు, కూటమికి 400 సీట్లు సాధించాలని పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంది. అయితే, బీజేపీ భారీ అంచనాలను సాధించలేకపోయింది.

ఎన్డీయే 294 స్థానాల్లో, బీజేపీ 240 స్థానాల్లో విజయం సాధించింది.  2019 ఎన్నికల్లో పోల్చి చూస్తే  బిజెపి సొంతంగా సొంతంగా 303 సీట్లు గెలుచుకుంది, ఇది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 మెజారిటీ మార్కు కంటే ఎక్కువ.

మొత్తంగా, 2019లో BJP నేతృత్వంలోని NDA 353 సీట్లు గెలుచుకుంది. దాదాపు 65.1% (353/542) ఓట్ షేర్  నమోదు చేసింది. మొత్తం పోలైన ఓట్లలో బీజేపీకి 37.36%, NDAకి దాదాపు 45% ఓట్లు వచ్చాయి.

2019లో ఆ పార్టీ బలమైన పనితీరు కనబరిచిన రెండు రాష్ట్రాలు — ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో బిజెపి సీట్ల  సంఖ్య తగ్గింది.  గత ఎన్నికల్లో యూపీలోని 80 స్థానాలకు గాను 62, మహారాష్ట్రలోని 48 స్థానాలకు గాను 23 స్థానాలను బీజేపీ గెలుచుకుంది.

అయితే, ఈసారి NDA 36 స్థానాలు మాత్రమే గెలుచుకుంది.  సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లతో కూడిన ఇండియా కూటమి 43 స్థానాలు కైవసం చేసుకుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles