30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

మోదీ ప్రభుత్వం మణిపూర్‌ను ‘అంతర్యుద్ధం’లోకి నెట్టింది.. రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం తన విధానాలు, రాజకీయాల కారణంగా మణిపూర్‌ను “అంతర్యుద్ధం”లోకి నెట్టిందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.

జాతి హింస చెలరేగినప్పటి నుండి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని సందర్శించలేదని కాంగ్రెస్ నేత విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో ప్రతిపక్షాల తరపున చర్చను ప్రారంభిస్తూ, మణిపూర్‌లో ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని రాహుల్ ఆరోపించారు.

“మీరు మణిపూర్‌ను అంతర్యుద్ధంలోకి నెట్టారు. మీరు, మీ విధానాలు, మీ రాజకీయాల వల్ల మణిపూర్ తగలబడిపోయింది’’ అని రాహుల్ అన్నారు.

మణిపూర్ భారత దేశం కాదన్నట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. “ప్రధానమంత్రికి మణిపూర్ రాష్ట్రం లేదు. అక్కడికి వెళ్లమని ప్రధానికి సందేశం ఇవ్వాలని కోరాం. కానీ  మీరు (ప్రధానమంత్రి ) సమాధానం ఇవ్వలేదు, ”అని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ ఈశాన్య రాష్ట్రంలోని మహిళల దుస్థితిని కూడా ప్రస్తావించారు. “మీరు మీ సంస్థలో మహిళలను చేర్చుకోరు, కానీ నేను వారి గురించి మాట్లాడగలను” అని అన్నారు.

షెడ్యూల్డ్ తెగ (ST) హోదా కోసం లోయ-ఆధిపత్యమైన మెయిటీ కమ్యూనిటీ  డిమాండ్‌కు వ్యతిరేకంగా కుకీ గిరిజనులు కొండ జిల్లాలలో మార్చ్‌ను నిర్వహించడంతో రాష్ట్రంలో జాతి హింస చెలరేగి మణిపూర్ గత ఏడాది మే నుండి ఉద్రిక్తత కొనసాగుతోంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles