33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

హథ్రస్‌ బాధితులను పరామర్శించిన రాహుల్‌ గాంధీ!

న్యూఢిల్లీ: జూలై 2న జరిగిన హథ్రస్‌ తొక్కిసలాట బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ చేరుకున్నారు. 123 మంది మరణించిన ఫులారి గ్రామంలో బాధిత కుటుంబాలను కలిశారు. వారిని ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని తెలిపారు.

అలీఘర్‌లోని పిల్ఖానాలో ఛోటే లాల్ భార్య మంజు, ఛోటే లాల్ కుమారుడు పంకజ్, ప్రేమవతి, ప్రమాదంలో మరణించిన విజయ్ సింగ్ భార్య శాంతి దేవి కుటుంబాలను కలుసుకున్నారు. వారిని పరామర్శించారు.

బోలే బాబా ఏర్పాటు చేసిన సత్సంగ్‌ వేదిక వద్ద సరైన ఏర్పాట్లు లేవని కాంగ్రెస్ ఎంపీని కలిసిన అనంతరం మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

రాహుల్ గాంధీ అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారని మరో మహిళ తెలిపారు.

శాంతిదేవి కుమారుడు నితిన్ కుమార్ మాట్లాడుతూ.. తాను తన తల్లితో కలిసి సత్సంగానికి వెళ్లానని, అయితే ఈ ఘటనలో ఆమె నుంచి విడిపోయానని చెప్పారు.

“మా అమ్మ చనిపోయింది. ఆమె పేరు శాంతి దేవి. మేము కలిసి సత్సంగానికి వెళ్ళాము. మేము సత్సంగంలో విడిపోయాము. నేను ముందుగానే ఈవెంట్ నుండి బయటకు వచ్చాను. సత్సంగం పూర్తయ్యాక తొక్కిసలాట జరిగిందని విన్నాను. నేను అక్కడకు వెళ్ళాను. కొంతసేపటికి మా అమ్మను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారని తెలిసి మా సోదరుడు ఆసుపత్రికి వెళ్లి చూడగా ఆమె చనిపోయిందని చెప్పారు.

సహాయం అందించడంపై రాహుల్ గాంధీ ఏమి చెప్పారని అడిగినప్పుడు, నితిన్ మాట్లాడుతూ, “అతను మా క్షేమం గురించి అడిగాడు. అన్ని రకాల సహాయం చేస్తామని హామీ ఇచ్చాడు. అలాంటి సంఘటనలు జరగకుండా పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తాలని మేము కోరామమని” అన్నాడు.

ఉదయం నుంచి రాహుల్ గాంధీ కోసం ఎదురు చూస్తున్నామని, అయితే ఆయన తమ ఇంటికి రాలేదని శాంతిదేవి కుమార్తె లత అన్నారు. బదులుగా, కాంగ్రెస్ ఎంపీని కలవడానికి వారి కుటుంబ సభ్యులలో కొందరిని మరొకరి ఇంటికి పిలిచారు.

అలీఘర్‌లో పర్యటించిన రాహుల్ గాంధీకి శాంతి దేవి మరో కుమారుడు జితేంద్ర ధన్యవాదాలు తెలిపారు.

“రాహుల్ గాంధీని కలవడానికి మమ్మల్ని వేరొకరి ఇంటికి పిలిచారు. అతను మా యోగక్షేమాలు అడిగాడు. మమ్మల్ని సందర్శించినందుకు నేను అతనికి కృతజ్ఞతలు తెలిపాను. అతను తన వైపు నుండి, ప్రభుత్వం వైపు నుండి సహాయం చేస్తానని చెప్పాడని అన్నాడు.

అంతకుముందు, ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం మెయిన్‌పురిలోని రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్ట్‌లో భోలేబాబా కోసం సోదాలు నిర్వహించారు.

ఈ సంఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈవెంట్ నిర్వాహకుల పేర్లను అందులో చేర్చారు.

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ), మైన్‌పురి సునీల్ కుమార్ నిన్న మాట్లాడుతూ, ‘భోలే బాబా అతని ఆశ్రమంలో కనిపించలేదు. హత్రాస్ సిటీ సూపరింటెండెంట్ రాహుల్ మిథాస్ కూడా ఆశ్రమంలో బోధకుడు కనిపించలేదని చెప్పారు.

బుధవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విషాద స్థలాన్ని సందర్శించి, ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. విచారణలో సమగ్రత, పారదర్శకతను నిర్ధారించడానికి జస్టిస్ (రిటైర్డ్) బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

తొక్కిసలాట ఘటనపై న్యాయ కమిషన్ వచ్చే రెండు నెలల్లో విచారణ జరిపి తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.

ప్రాథమిక నివేదిక ప్రకారం, భక్తులు ఆశీర్వాదం కోసం, భోలేబాబా పాదాల చుట్టూ మట్టిని సేకరించడానికి వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగింది. ఇంకోవైపు అతని భద్రతా సిబ్బంది దీనినిఅడ్డుకోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
మరోవంక స్వయం ప్రకటిత దైవం సూరజ్ పాల్ అలియాస్ ‘భోలే బాబా’ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన మొత్తం 123 మంది మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles