33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఘజియాబాద్‌లో పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసిన కన్వారియాలు!

లక్నో: ఘజియాబాద్‌లోని దుహై మెట్రో స్టేషన్ సమీపంలో పోలీసు వాహనాన్ని కన్వారియాల బృందం ధ్వంసం చేసింది. ఢిల్లీ- మీరట్ రోడ్డులోని దుహై సమీపంలో కన్వారియాల కోసం రిజర్వు చేసిన మార్గంలోకి ఒక వాహనం వచ్చింది. తమకు నిర్దేశించిన మార్గంలోకి ఆ వాహనం రావడంతో ఆగ్రహించిన కన్వారియాల బృందం పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసి, దానిని ఎత్తి ఒక పక్కకు పడేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జూలై 27, శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

పవర్ కార్పొరేషన్ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో నడిచే వాహనం ప్రమాదవశాత్తు లేన్‌లోకి ప్రవేశించి యాత్రికుడిని రాసుకుంటూ వెళ్లింది. దీంతో కన్వారియాలు రెచ్చిపోయారు. ఒక్కసారిగా ఆ వాహనంపైకి దాడికి దిగారు.

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలను చూస్తే… ఆందోళనకు గురైన కన్వరియాలు కర్రలు, రాడ్‌లు, ఇటుకలు, బేస్‌బాల్ బ్యాట్‌లను ఉపయోగించి ఆ వాహనాన్ని ధ్వంసం చేసినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో కన్వారియాల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందాలు కన్వరియాలను శాంతింపజేశాయి, సంఘటన సమయంలో భక్తులు తీసుకువెళ్లిన పవిత్ర గంగాజలానికి ఎలాంటి నష్టం కలగలేదని తెలిపాయి.

ఈ ఘటనకు సంబంధించి ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేశామని, విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని Xలో పేర్కొన్నారు. .

ఎస్‌యూవీ డ్రైవర్ అవ్నీష్ త్యాగిని అదుపులోకి తీసుకున్నారు. హైడల్ విజిలెన్స్ అధికారిగా విధులు నిర్వహించేందుకు తాను హైడల్ కవి నగర్ కార్యాలయానికి వెళ్తున్నట్లు త్యాగి చెప్పినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ కుమార్ తెలిపారు.

కాగా, జూలై 22న ప్రారంభమైన కన్వర్ యాత్ర ఉత్తరప్రదేశ్ అంతటా హింస, విధ్వంసక సంఘటనలు చోటుచేసుకున్నాయి.

ఈ వారం ప్రారంభంలో, కన్వారియాల గుంపు తమపై కర్రను ఊపినందుకు ఓ పిచ్చివాడిపై దారుణంగా దాడి చేసింది. దాడికి సంబంధించిన దిగ్భ్రాంతికరమైన వీడియో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, దాడిని చుట్టుపక్కలవారు తమ ఫోన్‌లలో రికార్డ్ చేయగా, ఆ గుంపు బాధితుడిని కనికరం లేకుండా కొట్టడం చూపిస్తుంది.

మరోవైపు కన్వారియాలు ఘజియాబాద్‌లో వాహనాలను ధ్వంసం చేయడం ఇది రెండోవది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో కన్వారియాల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. వాహనాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles