28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

నిన్న పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ, అధికార పక్షం మధ్య ఆసక్తికర చర్చ!

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా విపక్ష నేత రాహుల్‌ గాంధీ.. అదానీ, అంబానీ పేర్లను ప్రస్తావించినప్పుడల్లా బీజేపీ ఎంపీలు అడ్డుతగిలారు. ప్రతి ఐదు నిమిషాలకోసారి రాహుల్‌ ప్రసంగం సాగకుండా బీజేపీ ఎంపీలు గొడవ చేశారు.

ఈ నేపథ్యలో నిన్న పార్లమెంటులో విపక్షాలు, అధికార పక్షం మధ్య నాటకీయ చర్చ జరిగింది. రాహుల్‌ ప్రసంగంలో అంబానీ, అదానీ పేర్లు వచ్చినప్పుడల్లా సంసద్ టీవీలో ఆ మాటలు వినిపించేవి కావు. అంతేకాదు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉన్న హల్వా వేడుక ఫొటోను చూపిస్తే… సంసద్‌ టీవీ లైవ్‌లో స్పీకర్‌ను చూపించారు.  గతంలో కూడా అంబానీ, అదానీల గురించి గాంధీ చేసిన సూచనలను పార్లమెంటరీ రికార్డుల నుంచి తొలగించారు.

దీంతో రాహుల్‌ గాంధీ తన ప్రసంగంలో మహాభారత పురాణగాథను ప్రస్తావించారు, అక్కడ అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కి చనిపోయాడు. పద్మవ్యూహం (కమలం, భారతీయ జనతా పార్టీ చిహ్నం) అని కూడా పిలుస్తారు.

“21వ శతాబ్దంలో ఒక కొత్త చక్రవ్యూహం ఉంది. ఆ చిహ్నాన్ని ప్రధాని తన ఛాతీపై ధరించారు. అభిమన్యుతో చేసిన పని యువత, మహిళలు, రైతులు, MSMEలతో చేస్తున్నారు. ఇలా చక్రవ్యూహంలో వేల మంది ఉండగా, దానిని ఆరుగురు వ్యక్తులు దానిని నియంత్రిస్తున్నారని గాంధీ చెప్పారు. “ఆ ఆరుగురు వ్యక్తుల్లో మోదీ, షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అదానీ, అంబానీలు ఉన్నారని రాహుల్‌ అన్నారు.

దీనిపై అధికారపక్షం తీవ్ర నిరసన తెలిపింది. సభలో సభ్యులు కాని వారిని ప్రస్తావించబోమని కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ లిఖితపూర్వకంగా ఇచ్చారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.

“మీకు కావాలంటే నేను దోవల్, అంబానీ, అదానీల పేర్లను తీసివేస్తాను,” అని రాహుల్‌ గాంధీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

శివుడి భారత దేశంలో పద్మవ్యూహం పనిచేయదని, మహారాష్ట్రలో అదే జరిగిందని అన్నారు. ప్రజలకు హాని చేసేలా, ప్రజాస్వామ్య విరుద్ధంగా కేంద్రం నిర్మించిన పద్మవ్యూహాన్ని తాము ఛేదించి చూపిస్తామని రాహుల్‌ గాంధీ అన్నారు.

కేంద్రం పద్మవ్యూహంలోని మూడు రకాల బలగాల్లో ఒకటి ఆర్థిక బలగమని, ఇది అదానీ, అంబానీ చేతుల్లో ఉన్నదని అన్నారు. రెండో బలగం కేంద్ర దర్యాప్తు సంస్థలని చెప్పారు. ఈడీ, సీబీఐ, ఐటీలను ఉపయోగించి ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో బలగం రాజకీయ పార్టీలని రాహుల్‌గాంధీ అన్నారు.

తన అధికార పీఠానికి ప్రమాదం రాకుండా సంకీర్ణంలోని ప్రధాన మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు అధిక నిధులు ఇస్తోందని అన్నారు. ఇలా ప్రభుత్వం తన సొంత అవసరాల కోసం పెట్టుబడుదారులకు వంతపాడటం, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం, కొన్ని ప్రాంతాలపై పక్షపాతం చూపించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. నాడు పద్మవ్యూహంలో ఆరుగురు అభిమన్యుడిని హత్య చేశారని, తాము మాత్రం కచ్చితంగా ఈ పద్మవ్యూహాన్ని చేధిస్తామని రాహుల్‌ అన్నారు.

బడుగు,బలహీన వర్గాలపై వివక్ష
బడ్జెట్‌ హల్వా వేడుకలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన అధికారులపై వివక్ష చూపించారని రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న 20 మంది అధికారుల్లో ఇద్దరే దేశంలోని 95 శాతం ప్రజానీకానికి చెందినవారుగా ఉన్నారని చెప్పారు. వారిలో ఒకరు మైనారిటీ, మరొకరు ఓబీసీ తరగతికి చెందిన వారని అన్నారు. ఆ ఇద్దరూ హల్వా వేడుక పోస్టర్లో వెనుక భాగాన ఉన్నారని, వారిని ముందుకు రానివ్వలేదని అంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉన్న హల్వా వేడుక ఫొటోను చూపిస్తూ వ్యాఖ్యానించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles