30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ప్రధానిపై సభాహక్కుల తీర్మానం…స్పీకర్‌కు నోటీసులిచ్చిన కాంగ్రెస్‌!

న్యూఢిల్లీ:  లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కులం గురించి బిజెపి ఎంపి అనురాగ్ ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్య రాజకీయంగా దుమారం రేపింది. అనురాగ్ వ్యాఖ్యల్లో స్పీకర్ తొలగించిన భాగాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్’లో షేర్ చేశారని, ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజి సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ బుధవారం స్పీకర్ ఓం ప్రకాశ్‌ బిర్లాకు నోటీసు ఇచ్చారు.

లోక్‌సభ సభ్యుల ప్రవర్తనా నిబంధన 222 కింద ఈ నోటీసు ఇస్తున్నట్లు తెలిపారు. సభాపతి రికార్డులనుంచి తొలగించిన భాగాలతో కలిపి మొత్తం ప్రసంగాన్ని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేయడం తనను నిర్ఘాంతపరిచిందని చన్నీ పేర్కొన్నారు. అభ్యంతరకరమని సభాపతి భావిస్తూ రికార్డుల నుంచి తొలగించిన మాటలను, వ్యాఖ్యలను మరెక్కడా ప్రస్తావించరాదని, వాటి గురించి మాట్లాడరా దని నిబంధనలు చెబుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ తెలిపారు.

“కుల గణన, OBCల గురించి చాలా చర్చ జరుగుతోంది. జిస్కీ జాత్ కా పతా నహీ, ఓ గణనా కీ బాత్ కర్తా హై [తన కులం ఏమిటో తెలియని వ్యక్తి కులగణన గురించి డిమాండ్ చేస్తున్నారని]” అనురాగ్‌ ఠాకూర్ మంగళవారం కేంద్ర బడ్జెట్ సందర్భంగా జరిగిన చర్చలో రాహుల్‌ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అనురాగ్‌ ఠాకుర్‌ వ్యాఖ్యలపై వివక్ష సభ్యుల అభ్యంతరంతో స్పీకర్ స్థానంలో ఉన్న జగదంబికా పాల్ (కాంగ్రెస్ ఎంపీ) అనురాగ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.

అయితే ప్రధాని మోదీ సామాజికమాద్యమం Xలో అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని మొత్తం షేర్ చేస్తూ.. ఈ వీడియోను ‘తప్పకుండా వినండి. ఇది వాస్తవాలు, హాస్యం మేలు కలయిక. ఇండియా కూటమి నీచ రాజకీయాలను ఎండగట్టింది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.

భాజపా ఎంపీ అనురాగ్ ఠాకుర్ వ్యాఖ్యలపై విపక్షాలు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. పార్లమెంటరీ ప్రసంగాల స్థాయిని కనిష్టస్థాయికి అనురాగ్ దిగజార్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ దుయ్యబట్టారు. అటువంటి ప్రసంగాన్ని సమర్థిస్తూ, ప్రశంసిస్తూ ప్రధాని మోదీ పార్లమెంటరీ సంప్రదాయాలకు, నిబంధనలకు తూట్లు పొడిచారని ఆరోపించారు.

ఈ సందర్భంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ… “ఈరోజు సభలో ప్రతిపక్షాల తీరును నేను ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ రోజంతా ‘కులం, కులం’ అని ఏడుస్తూనే ఉన్నారు… నేడు కాంగ్రెస్ దేశాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించింది. కాంగ్రెస్ సైన్యాన్ని విమర్శించడం ద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిందని నేను స్పీకర్ ద్వారా సభకు చెప్పాలనుకుంటున్నాను … భారత ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి పనిచేసింది … మేము నియమాలు, నిబంధనలను అనుసరిస్తామని రిజిజు అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles