33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

వాయనాడ్ విషాదాన్ని ఎగతాళి చేసిన ‘రైట్‌వింగ్‌’ నెటిజన్లు!

తిరువనంతపురం: ప్రకృతి విలయతాండవం ధాటికి కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఓవైపు ప్రకృతి ప్రకోపంతో కేరళ విలవిలలాడుతుండగా, రాష్ట్రంలోని నిస్సహాయ ప్రజల పట్ల ఉదాసీనతను ప్రదర్శిస్తూ, మితవాద సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి ద్వేషపూరిత వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో దర్శనమిస్తున్నాయి.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వ్యాఖ్యలు కేరళ, వాయనాడ్ ప్రజలను ఎగతాళి చేసినట్లుగా కనిపించాయి.

సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని స్పందనలు
ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు “ప్రకృతి మీకు అన్ని నేర్పుతుంది, దేవుడు మీ కోసం దెయ్యాన్ని పంపుతాడు” అని చెప్పగా, మరొకరు, “ఎప్పటిలాగే, ఉత్తర భారత సైన్యం, ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని రక్షించడానికి వచ్చాయి” అని అన్నారు.

కొన్ని స్పందనలు ఇలా ఉన్నాయి.

మరి కొన్ని స్పందనలు

రాహుల్ ప్రియాంక వాయనాడ్‌లో పర్యటించనున్నారు
జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో జరిగిన విధ్వంసాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గురువారం వయనాడ్‌లో పర్యటించనున్నారు.

వారి పర్యటనలో భాగంగా… మెప్పాడిలోని సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతూ నిరాశ్రయులైన కుటుంబాలను కలుస్తారు. షెడ్యూల్‌ ప్రకారం…మెప్పాడిలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్, సెయింట్ జోసెఫ్ యుపి స్కూల్, డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీలో నిర్వహిస్తున్న మూడు సహాయ శిబిరాలను సందర్శించనున్నారు.

ఈ సమావేశంలో, వారు బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపి, వారికి సాధ్యమైన సాయంపై హామీ ఇవ్వనున్నారు.

దాదాపు 176 మంది చనిపోయారు, 191 మంది తప్పిపోయారు
జులై 30 తెల్లవారుజామున ఆకస్మిక వరదల కారణంగా ముండక్కై, చూరల్మల గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డంతో అవి పూర్తిగా నేలమట్టమయ్యాయి.

నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ స్థానిక సంస్థల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్‌లను నిర్వహిస్తున్నాయి. 191 మంది గల్లంతయ్యారని, 176 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక నివేదికలు చెబుతున్నాయి.

అమిత్‌ షా వాదనలు నిరాధారం: కేరళ సీఎం
ఇదిలా ఉండగా, భారీ వర్షాల కారణంగా వాయనాడ్‌లో ప్రకృతి వైపరీత్యం సంభవించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వాదన “నిరాధారం” అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు.

జులై 23 నుంచి 29 వరకు వరద హెచ్చరికలు జారీ చేసే బాధ్యత కలిగిన సెంట్రల్ వాటర్ కమిషన్ ఇరువజింజి పూజ లేదా చలియార్ నదులపై ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని విజయన్ తెలిపారు.

“నేను ఎవరినీ నిందించను. బ్లేమ్ గేమ్‌లకు ఇది సమయం కాదు. కానీ, వాతావరణ మార్పు ఈ విషాదానికి దారితీసిందని, ఈ మార్పులను పరిష్కరించడానికి మనం చురుకైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రం అర్థం చేసుకోవాలని సీఎం అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles