24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘ఫ్రెషర్స్‘కు శుభవార్త చెప్పిన ఇన్ఫోసిస్… ఈ ఏడాది 55 వేల మందికి ఉద్యోగాలు!

ముంబయి: ఐటీ జాబ్స్ చేయాలనుకునే ప్రెషర్స్(Freshers)కు దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సంస్థ శుభవార్త  చెప్పింది. 2022-23 ఏడాదిలో క్యాంపస్ సెలక్షన్స్ (Campus Selections) కింద 55,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్(Salil Parekh) అన్నారు. బెంగళూరు(Bengalore)లోని ఇన్ఫోసిస్ ప్రధాన కార్యాలయంలో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ టెక్ రంగం(Tech Sector)లో ఇంజినీరింగ్ సైన్స్ గ్రాడ్యుయేట్ (Engineering ScienceGraduates)లకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే తక్కువ వ్యవధిలో కొత్త నైపుణ్యాలను నేర్చుకునే వారికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. 2022-23 ఏడాదిలో 55వేల కాలేజీ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేస్తామన్నారు. వచ్చే ఏడాదిలో ఆ సంఖ్యను మరింత పెంచుతామన్నారు.  2022లో ఇన్ఫోసిస్ వార్షిక రాబడిలో 20 శాతం ఎగబాకాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఫ్రెషర్స్ కు కంపెనీలో చేరడానికి ఇదో గొప్ప అవకాశం అన్నారు. యువత నైపుణ్యత (Skills) పై దృష్టి పెట్టేందుకు ఆరు నుంచి 12 వారాల పాటు ఫ్రెషర్స్ కు శిక్షణ ఇస్తుందని పరేఖ్ అన్నారు.
ఉద్యోగులు అప్ డేట్ అవ్వాలి. కాలేజీ విద్యార్థుల కోసం, భారీ అవకాశాలు ఎదురుచూస్తున్నాయని, అయితే తక్కువ వ్యవధిలో కొత్త నైపుణ్యాలను వృద్ధి చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని పరేఖ్ కోరారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారు ప్రతి దశాబ్దానికి ఒకసారి నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. యువ గ్రాడ్యుయేట్లు ప్రతి మూడు నుంచి ఐదు సంవత్సరాలకు అప్డేట్ అవ్వాలన్నారు.
ఇన్ఫోసిస్ యువకుల భవిష్యత్తుకు చాలా మంచి మార్గదర్శి అని అన్నారు. భవిష్యత్తులో పని చేసే నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై దృష్టిసారిస్తున్నట్లు ఆయన అన్నారు. క్లయింట్ల కోసం పెద్ద ఎత్తున డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేపట్టడం వల్ల వస్తున్న పనితో, ఇతర వాటాదారుల విక్రేతలతో కలిసి పనిచేయడానికి తమ తమ కంపెనీ సిద్ధంగా ఉందని పరేఖ్ చెప్పారు. క్లయింట్ అవసరాలను తీర్చడానికి పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ ప్లాట్ఫారమ్ ను సర్వీస్ వర్క్ ఏకీకృతం చేస్తామన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles