30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

భారతీయ ఐటీ నిపుణులకు జర్మనీలో అద్భుత అవకాశాలు… టీఎంఐ గ్రూప్‌!

హైదరాబాద్: భారత ఐటీ నిపుణులు జర్మనీలో పనిచేసేందుకు మంచి అవకాశాలుకల్పించేదుకు టీఎంఐ(TMI) గ్రూప్‌, చిన్మయ్ డాక్టర్‌ (CD) రిక్రూటింగ్ సంస్థ సంయుక్తంగా ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా టీఎంఐ చైర్మన్‌ టి.మురళీధరన్‌ మాట్లాడుతూ.. భారత్‌ నుంచి ఐటీ ప్రతిభ ఎప్పుడూ అవకాశాల కోసం అమెరికా వైపుచూస్తుందన్నారు. జర్మనీలోనే ఉంటూ, జర్మన్ కంపెనీల కోసం పని చేయాలనుకునేభారతీయులకు జర్మనీ తన అధునాతన సాంకేతికతను పరిచయం చేసేందుకు అద్భుతమైనఅవకాశాన్ని అందిస్తుంది. టీఎంఐ గ్రూప్, జర్మన్ కంపెనీల కోసం ప్రతిభ కలిగినభారతీయులను రిక్రూట్‌ చేసుకోడంలో అనుభవజ్ఞుడైన మంచి రిక్రూట్‌మెంట్ స్పెషలిస్ట్ అయినచిన్మయ్ డాక్టర్‌తో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని టీఎంఐ గ్రూప్‌ ఛైర్మన్‌ అభిప్రాయపడ్డారు.  అనేక జర్మన్ కంపెనీలు భారతీయ నిపుణులను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని, సీడీ రిక్రూటింగ్ వ్యవస్థాపకులు డాక్టర్ చిన్మయ్ తెలిపారు.
“భారతదేశ ఐటీ ప్రతిభ గురించి జర్మనీ ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.జర్మన్ కంపెనీలను భారత ఐటీ నైపుణ్యాలను అనుసంధానించడానికి ఒక వేదిక లేదు. ఎంబడెడ్‌, వీఎల్‌ఎస్‌ఐ, ఈ-కామర్స్, గేమింగ్, ఈఆర్‌పీ, రోబోటిక్స్ మొదలైన రంగాలలో ఐటీ ప్రతిభ కోసం జర్మనీ వెతుకుతోంది. ఇక్కడ అత్యాధునిక జీవన ప్రమాణాలతో కూడిన సురక్షితమైన నగరాలు ఉన్నాయి. ఐటీ నిపుణులకు 33 నెలల ఈయూ బ్లూ కార్డ్‌కు అర్హులు. ఈ కార్డుతో వారు ఐరోపా అంతటా ప్రయాణించగలరు. ఒక వేళ ఐటీ నిపుణులు తల్లిదండ్రులయితే, వారి పిల్లలకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య ఉంటుంది.
ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా జర్మన్ భాష వచ్చి ఉండాలి కాబట్టి, ఆ విషయంలో జర్మనీకి వలస వెళ్ళే ముందు అవసరమైన నైపుణ్యాన్ని పొందడానికి టీఎంఐ గ్రూప్ వారికి అన్ని విధాల సహకారం అందజేస్తుంది. దానితో పాటు, టీఎంఐ, సీడీ రిక్రూటింగ్ ఉద్యోగి జర్మనీకి వెళ్లాలనుకునే ఉద్యోగి డాక్యుమెంటేషన్, పాఠశాల అడ్మిషన్లు, పునరావాసం మొదలైనవాటిలో సహాయం చేస్తుంది. కాబట్టి ఈ అవకాశాలను ఉద్యోగార్థులు ఉపయోగించుకోవాలని ఈ రెండు కంపెనీలు ఐటీ నిపుణులకు సూచించాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles