28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

భారత భద్రతా బలగాల్లో మహిళల కీలక పాత్ర… సరిహద్దుల్లో గస్తీ… వీడియో షేర్​ చేసిన ఐటీబీపీ!

న్యూఢిల్లీ: మహిళల భాగస్వామ్యం లేని రంగం అనేది ఈనాడు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు వంట ఇంటికి మాత్రమే పరిమితమైన అతివలు ఇప్పుడు ఆకాశంలో సగం మాదేనంటున్నారు. పురుషుల‌కు మేం ఏమీ తీసిపోం అని నిరూపిస్తున్నారు  దేశరక్షణ రంగంలో కూడా ప్రతిభ చాటుతున్నారు మ‌హిళా సైనికులు.
భారత భద్రతా బలగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. పురుషులకు దీటుగా సేవలు అందిస్తున్న మహిళా జవాన్లు.. ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల్లో గస్తీ కాస్తూ దేశ భద్రతకు ముప్పు కలగకుండా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అరుణాచల్​ ప్రదేశ్​లోని భారత్​ చైనా సరిహద్దు వద్ద మహిళా బలగాలు గస్తీ కాస్తున్న వీడియోను ఐటీబీపీ సోషల్​ మీడియాలో షేర్​ చేసింది. ఇండో-టిబెటన్​ బార్డర్​ పోలిస్​కు (ఐటీబీపీ) చెందిన వీరు తుపాకులు చేతపట్టి ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ స్థానికులకు రక్షణ కల్పిస్తున్నారు.
రోజు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని (మార్చి 8)పుర‌స్క‌రించుకొని.. ఐటీబీపీకి చెందిన మ‌హిళా జ‌వాన్లు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ – చైనా స‌రిహ‌ద్దుల్లో పెట్రోలింగ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళా జ‌వాన్ల‌కు వుమెన్స్ డే శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి.
చైనా సరిహద్దుకు సమీపంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో సరిహద్దు భద్రతలో నిమగ్నమై ఉన్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) మహిళా సైనికులు మహిళా శక్తికి అద్భుతమైన ఉదాహరణగా నిలిస్తున్నారు. సరిహద్దులోని క్లిష్ట భూభాగంలో క్లిష్ట వాతావరణ పరిస్థితులలో, . అడవి, నది, పర్వతం ఇలా ఎక్కడ చూసినా సరిహద్దును రక్షించేందుకు ఐటీబీపీకి చెందిన ఈ మహిళా సైనికులు సిద్ధంగా ఉన్నారు.  ఐటీబీపీ మహిళా సిబ్బంది జమ్మూకశ్మీర్‌ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు సరిహద్దులో కాపలాగా ఉన్నారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles