24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

అలీగఢ్‌లో హిజాబ్‌ వివాదం… ముస్లిం బాలికలకు కాలేజీలో ప్రవేశం నిరాకణ!

అలీగఢ్ (ఉత్తరప్రదేశ్): అలీఘర్‌లోని ఒక ప్రముఖ కళాశాల “యూనిఫాం” లేకుండా క్యాంపస్‌లోకి విద్యార్థుల ప్రవేశాన్ని నిషేధిస్తూ నోటీసు జారీ చేసింది. ముఖ్యంగా హిజాబ్ ధరించిన ముస్లిం బాలికలకు ప్రవేశాన్ని నిరాకరించింది. క్లాస్‌కు హాజరయ్యేటప్పుడు ముఖాన్ని కప్పుకోవద్దని శ్రీవర్షిణీ కాలేజీ శనివారం విద్యార్థులను ఆదేశించింది. కాలేజీ యాజమాన్యం ప్రవేశం నిరాకరించడంతో పలువురు ముస్లిం విద్యార్థులు ఇంటికి చేరుకున్నారు. తమను లోనికి అనుమతించేందుకు సిబ్బంది నిరాకరించారని విద్యార్థులు తెలిపారు.
బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని, క్యాంపస్‌లోకి ప్రవేశించే సమయంలో తాను ధరించిన బురఖాను తొలగించాలని కళాశాల అధికారులు మొదట అడిగారని, ఆ తర్వాత హిజాబ్‌ను కూడా తొలగించాలని కోరారని తెలిపారు.
యూపీలో “మా హిజాబ్‌తో వారికి ఎందుకు సమస్య ఉందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. హిజాబ్ లేకుండా ఎక్కడికీ వెళ్లడానికి నేను సిద్ధంగా లేను. కళాశాల మమ్మల్ని ఇకపై క్యాంపస్‌లోకి అనుమతించమని చెప్పిందని ఆ విద్యార్థిని వాపోయింది. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బీనా ఉపాధ్యాయ మాట్లాడుతూ, ఈ నోటీసు విద్యార్థులకు ‘రిమైండర్’ కాలేజ్‌లో “డ్రెస్ కోడ్” ఉందని, అదే విధంగా పాటించాలని అన్నారు.
కళాశాల ప్రొక్టర్ అనిల్ వర్ష్నేని సంప్రదించగా, “ప్రాస్పెక్టస్‌లో డ్రెస్ కోడ్ స్పష్టంగా పేర్కొన్నామని తెలిపారు. “విద్యార్థులు కళాశాల నియమ నిబంధనలను మాత్రమే పాటించాలని మేము కోరుకుంటున్నాము. మేము ఆదేశాలను అనుసరిస్తున్నాము. డ్రెస్ కోడ్‌లను ఇప్పుడు మరింత సీరియస్‌గా అమలు చేస్తామని విద్యార్థులకు ఇప్పుడే తెలియజేశామని ఆయన తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles