30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

సరుకు రవాణా ద్వారా దక్షిణమధ్య రైల్వేకు 10 వేల కోట్ల ఆదాయం!

హైదరాబాద్: కోవిడ్-19 మహమ్మారి సవాళ్లను అధిగమించి, దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 112.51 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా 10,000 కోట్ల రూపాయల సరకు రాబడిని నమోదు చేసి సరుకు రవాణా ఆదాయంలో కొత్త మైలురాయిని అధిగమించింది. ఈ ఆర్థిక సంవత్సరం  సరుకు రవాణా లోడింగ్‌లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.
రకు రవాణా వ్యాపారాన్ని రైల్వేల వైపు ఆకర్షించడానికి దక్షిణ మధ్య రైల్వే చేసిన ప్రయత్నాలు, సరుకు రవాణా రైళ్ల కదలికపై నిరంతర పర్యవేక్షణతో పాటు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయంలో 17.7 శాతం, లోడింగ్‌లో 17.3 శాతం పెరగడంలో రికార్డు స్థాయి ఆదాయాన్ని గడించింది. ప్రధానంగా బొగ్గు 53.78 మెట్రిక్‌ టన్నులు, సిమెంట్‌ 32.339 మెట్రిక్‌ టన్నులు‌, ఆహార ధాన్యాలు 7.980 మెట్రిక్‌ టన్నులు, ఎరువులు 5.925 మెట్రిక్‌ టన్నులు, 2.137 మెట్రిక్‌ టన్నులతో కంటైనర్‌ సేవలు, ఒక ఉక్కు కర్మాగారారానికి ముడిసరుకు, 4 మెటీరియల్‌లు, 5.80 మెట్రిక్‌ టన్నులు అల్యూమినా పౌడర్, ఫ్లై యాష్, గ్రానైట్, చక్కెర రవాణా వంటి కారణాలు దక్షిణమధ్య రైల్వే ఆదాయ వృద్ధికి బాగా దోహదపడ్డాయి.
వివిధ సరుకు రవాణా ప్రోత్సాహక పథకాలను పరిచయం చేయడం, అనేక వే-సైడ్ స్టేషన్‌లలో మౌలిక సదుపాయాలతో సహా సరుకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం సరుకు రవాణా ఆదాయం, లోడింగ్… రెండింటిలోనూ బలమైన వృద్ధిని నమోదు చేయడంలో సహాయపడిందని దక్షిణమధ్య రైల్వే (SCR) ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
దనంగా, డివిజన్, జోనల్ స్థాయిలో కొత్తగా ఏర్పడిన బిజినెస్ డెవలప్‌మెంట్ యూనిట్లు (BDU) ఈ జోన్‌లో సరకు రవాణాను మెరుగుపరచడంలో దోహదపడ్డాయి. రికార్డు స్థాయి ఆదాయాన్ని గడించడంలో విశేష కృషి చేసిన సరుకు రవాణా ఆదాయ విభాగాన్ని, దక్షిణమధ్య రైల్వే ఉద్యోగులను… జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ అభినందించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles