33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

హైదరాబాద్‌లో పొడవైన టన్నెల్ రోడ్డు… త్వరలోనే నిర్మాణం… దేశంలో ఇదే మొదటిది!

హైదరాబాద్ నగరం త్వరలో దేశంలోనే మొట్టమొదటి పొడవైన హైవే టన్నెల్ రహదారిని ఏర్పాటు చేయనున్నారు. ఇది జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 నుండి బంజారాహిల్స్ రోడ్డు నెం. 12 జంక్షన్ సుమారు 10 కి.మీ. నాలుగు లేన్లతో కూడిన సొరంగ రహదారి. ఈ టన్నెల్ రోడ్ కేబీఆర్ (KBR) పార్క్ జంక్షన్ మీదుగా NFCL జంక్షన్, పంజాగుట్ట వరకు వెళుతుంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ (ఎస్‌ఆర్‌డిపి) ప్రాజెక్ట్ కోసం కేబీఆర్ పార్క్ వద్ద చెట్లను నరికివేయకుండా ఉండటానికి తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రణాళికను పరిశీలిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) సమగ్ర అధ్యయనం తర్వాత త్వరలో నాలుగు లైన్ల సొరంగ రహదారి నిర్మాణాన్ని చేపట్టనుంది. బహుళ-స్థాయి ఫ్లైఓవర్‌లను నిర్మించడం ద్వారా పార్క్ వద్ద 1,500 చెట్లకు పైగా నరికివేయాల్సి వస్తోంది. దీంతో ఎస్.ఆర్.డీ.పీ (SRDP) ప్రాజెక్ట్ కింద  కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు జంక్షన్లను నిర్మించాలనే ప్రభుత్వ ప్రణాళికకు… సొరంగ రహదారి నిర్మాణం ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈఎస్‌జెడ్‌ పరిధిలోకి వచ్చే పార్కు మొదటి సరిహద్దు గోడలోని చెట్లను జీహెచ్‌ఎంసీ తాకరాదు. కాగా రెండో సరిహద్దు గోడ కింద ఉన్న చెట్లు ఈఎస్‌జెడ్‌ పరిధిలోకి రావు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles