23.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

‘వింగ్స్ ఇండియా’ -2022.. ఆసియాలోనే అతిపెద్ద ఏవియేషన్‌ షో… నేడు హైదరాబాద్‌లో ప్రారంభం!

హైదరాబాద్: గగనంలో విహరించే విమానాలు నేలపై వరుస కట్టాయి. ఇందుకు బేగంపేట విమానాశ్రయం వేదికైంది. ఆసియాలోనే అతిపెద్ద ఏవియేషన్‌ షో ‘వింగ్స్ ఇండియా’ ఏవియేషన్‌-2022  పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా చేతుల మీదుగా లాంఛనంగా ఇవాళ ప్రారంభం కానుంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో ఏవియేషన్ షో కనువిందు చేయనుంది.

‘ఇండియా @ 75; న్యూ హారిజెన్‌ ఫర్‌ ఏవియేషన్‌ ఇండస్ట్రీ’ అనే థీమ్‌తో సాగనున్న ఈ ప్రదర్శనలో దేశ, విదేశాలకు చెందిన పలు విమానయానరంగ కంపెనీలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. తొలి రెండు రోజులు విమానయాన రంగానికి చెందిన సంస్థలు తమ ఉత్పత్తుల గురించి వివరించనున్నాయి. ఈ రంగంలో వస్తున్న నూతన సాంకేతికత, నిర్వహణలో వస్తున్న కొత్త విధానాలు, కొత్త కొత్త పరికరాలు, ఆర్థిక వనరులు, ఆయా దేశాల్లో అనుసరిస్తున్న విధానాలు, వివిధ బిజినెస్‌ మోడల్స్‌, కొత్త భాగస్వామ్యాలు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నాయి. ముఖ్యంగా దేశంలో విమానాల విడిభాగాల తయారీ, నిర్వహణ, ఎంఆర్‌వోల ఏర్పాటు తదితర అంశాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

సరికొత్త ఎయిర్‌ బస్‌-350, బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రార్స్‌ సంస్థ నుంచి అతిపెద్ద కమర్షియల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ -ఇ-195–ఇ2 విమానాలు కొలువుదీరనున్నాయి. భారత ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్‌ టీమ్‌ ఆధ్వర్యంలో ఏరోబ్యాటిక్స్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వింగ్స్ ఇండియా ఏవియేషన్-2022లో భాగంగా తొలి రెండు రోజులు వ్యాపార కార్యకలాపాల కోసం పరిమితం చేయగా.. చివరి రెండు రోజులు సాధారణ ప్రజలకు అనుమతిస్తారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles