24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఫ్రెంచ్ వర్సిటీతో ఉస్మానియా వర్సిటీ ఒప్పందం!

హైదరాబాద్: హైబ్రిడ్ మాస్టర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఫ్రాన్స్‌లోని బోర్డియక్స్ విశ్వవిద్యాలయాల మధ్య అంతర్జాతీయ సహకారం కోసం ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఫ్రాన్స్‌లోని మూడు విశ్వవిద్యాలయాలు, మన దేశంలోని మూడు విశ్వవిద్యాలయాల సహకారంతో “ఆరోగ్యం, సౌందర్య సాధనాలలో సహజ పదార్థాలు”అన్న అంశంపై పరిశోధనలు చేసేందుకు ఒకరికొకరు సహకరించుకుంటారు. ఉస్మానియా యూనివర్సిటే కాకుండా మన దేశం నుంచి ముంబై విశ్వవిద్యాలయం, బెంగుళూరులోని ట్రాన్స్-డిసిప్లినరీ విశ్వవిద్యాలయాలు (TDU), పారిస్ విశ్వవిద్యాలయం, ఫ్రాన్స్ నుండి ISIPCA-Versailles తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశ్యం…

  • సాధారణ రంగాలలో నైపుణ్యాన్ని పెంచడం
  • సహకార, పరిశోధన అధ్యయన కార్యకలాపాలను ప్రోత్సహించడం.
  • నిర్ణీత కాల వ్యవధిలో బోధన
  • లెక్చరర్లు, పరిశోధకుల మార్పిడి
  • సందర్శనలను ప్రోత్సహించడం
  • ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలను నిర్వహించడం
  • సహకార సింపోజియా, సమావేశాలు శాస్త్రీయ సమావేశాలను నిర్వహించడం
  • విద్యార్థుల మార్పిడి, ఉమ్మడి అధ్యయన కార్యక్రమాలను ప్రోత్సహించడం;

ఉస్మానియా వర్సిటి, డైరెక్టర్, యూనివర్సిటీ ఫారిన్ రిలేషన్స్ ఆఫీస్ (UFRO),  డైరెక్టర్, రీసెర్చ్ & డెవలప్‌మెంట్ కోసం సెంట్రల్ ఫెసిలిటీస్ (CFRD), సంబంధిత ఫ్యాకల్టీల డీన్‌లు, ఉస్మానియా యూనివర్సిటీ డీన్ డెవలప్‌మెంట్ & UGC వ్యవహారాలు ఈ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని సమన్వయం చేయడంలో నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు.

ఈ సందర్భంగా ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రసంగిస్తూ ఎంవోయూపై హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్‌ఫేస్‌ను అందించడానికి పరిశ్రమతో ఇతర విశ్వవిద్యాలయాలు, సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకోవడం ద్వారా… పరిశోధన యొక్క అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఇంటర్-డిస్ప్లినరీ విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి ఒక్కాణించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles