30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఏవియేషన్ రంగంలో మహిళలు కెరీర్ కొనసాగించాలి… ఇండియన్ ఉమెన్ పైలట్ అసోసియేషన్!

హైదరాబాద్: దేశంలోని యువతులు ఏరోస్పేస్, ఏవియేషన్ రంగంలో కెరీర్‌ను కొనసాగించాలని ఇండియన్ ఉమెన్ పైలట్ అసోసియేషన్ (ఐడబ్ల్యుపిఎ) సభ్యులు ఆదివారం కోరారు. ఏవియేషన్, ఏరోస్పేస్‌పై మహిళలకు అవగాహన కల్పించడం, వృత్తిపరమైన మార్గదర్శకత్వం అందించడం వంటి విషయాల్లో సమిష్టి కృషి అవసరం అని ఇండియన్ ఉమెన్ పైలట్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం ఇక్కడ ముగిసిన ‘వింగ్స్ ఇండియా 2022’ సదస్సులో అన్నారు.
భారతదేశంలో మొత్తం 17,726 మంది పైలట్‌లు ఉన్నారు, వారిలో 15 శాతం లేదా 2,764 మంది మహిళలు ఉండగా, ప్రపంచవ్యాప్తంగా, పైలట్‌లలో మహిళలు 5 శాతం ఉన్నారు.
ఐడబ్ల్యుపిఎ హైదరాబాద్ చాప్టర్ ఇన్‌చార్జి, కెప్టెన్ సప్నా పటేల్ మాట్లాడుతూ భారతదేశంలో మహిళా పైలట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రపంచ సగటుతో పోల్చినప్పుడు, ఎక్కువ మంది మహిళలు ఈ వృత్తిని చేపట్టడానికి ఇంకా చాలా ఖాళీ ఉందని సూచించారు. “నేటి యుగంలో మహిళలు ప్రతి రంగంలో పని చేయడం మనం చూడవచ్చు, కానీ అది సరిపోదు. మేము ఏవియేషన్, ఏరోస్పేస్‌పై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
ఎక్కువ మంది మహిళలు ఈ రంగంలోకి ప్రవేశించేలా చూసేందుకు, విమానయానం చేయాలనుకునే మహిళలు, విమానయానానికి సంబంధించిన అధికారుల మధ్య ఐడబ్ల్యుపిఎ ఒక మాధ్యమంగా పనిచేస్తుందని కెప్టెన్ సప్నా పటేల్ చెప్పారు. “ఇప్పటివరకు విమానయానం చేయని వారు కూడా ఐడబ్ల్యుపిఎ లో చేరవచ్చు. అందులోని సభ్యుల అనుభవాన్ని మీరు నేర్చుకోవచ్చు. ఏవియేషన్‌లో విజయవంతమైన వృత్తిని కొనసాగించడంలో సహాయం పొందవచ్చు” అని ఆమె చెప్పారు.
మహిళా పైలట్‌లను ప్రోత్సహించడానికి, ఐడబ్ల్యుపిఎ అధునాతన శిక్షణ కోసం అర్హులైన వ్యక్తులకు స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. “మేము అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నాము ఎందుకంటే మన సమాజంలో కుటుంబాలు ఈ రకమైన రంగాలలో మహిళలను అనుమతించవు” అని ఆమె పేర్కన్నారు.
నాలుగు రోజులపాటు నగరవాసులను కనువిందు చేసిన ఏవియేషన్‌ షో ఆదివారం ముగిసింది. ఆఖరిరోజు సారంగ్‌ బృందం హెలికాఫ్టర్ల విన్యాసాలు అబ్బురపర్చాయి. భారతదేశం , విదేశాల నుండి 125 మంది ఎగ్జిబిటర్లను ప్రదర్శించిన ఈ ఎయిర్ షో 5,000 మంది వ్యాపార ప్రతినిధులను శని, ఆదివారాల్లో కలిపి సుమారు 60 వేలమంది ప్రదర్శనను సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఏవియేషన్ షో ఈ రంగంలో సరికొత్త సాంకేతికతను ప్రదర్శించడమే కాకుండా వ్యాపార ప్రతినిధులు, సాధారణ ప్రజలకు ఈ రంగాన్ని నిశితంగా వీక్షించే అవకాశాన్ని కల్పించింది. భారతదేశంలో ‘వింగ్స్ ఇండియా 2022’ సందర్భంగా, ఎయిర్‌బస్ భారత మార్కెట్ కోసం  A350 గురించి వివరించింది. విమానయాన ప్రదర్శనలో భారత వైమానిక దళం  ‘సారంగ్’ బృందం అద్భుతమైన హెలికాప్టర్ విన్యాసాలను కూడా ప్రదర్శించింది.
నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL) SARAS-Mk II ఎయిర్‌క్రాఫ్ట్ మాకప్‌ను ఆవిష్కరించడమే కాకుండా, దాని రెండు-సీట్ల ఫ్లయింగ్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ NAL-హంస NG డెమో ఫ్లైట్‌ను నిర్వహించింది మరియు డ్రోన్ ఫార్మేషన్ షోతో ఆక్టాకాప్టర్‌ను ప్రదర్శించింది. CSIR-నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ మరియు M/s సైంటెక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరింది. తదుపరి వింగ్స్ ఇండియా షో బేగంపేట విమానాశ్రయంలో 2024 మార్చి 14 నుండి 17  వరకు నిర్వహించబడుతుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles