33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

కాంగ్రెస్‌ బలపడాలి… కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ!

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ పార్టీపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకొని, జాతీయ స్థాయిలో బలంగా మారాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని కేంద్ర రవాణా ాఖా మంత్రి పేర్కొన్నారు. ఇటీవల ముంబయిలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. బలహీన పడిన కాంగ్రెస్ స్థానాన్ని ప్రాంతీయ పార్టీలు భర్తీ చేయడం మంచి సంకేతం కాదన్నారు. ‘ప్రజాస్వామ్యం రెండు చక్రాలపై నడుస్తుంది. వాటిలో ఒకటి పాలకపక్షం. రెండోది ప్రతిపక్షం. ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షం అవసరం. అందుకే కాంగ్రెస్ పార్టీ మరింత బలపడాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ బలహీనపడటంతో ఆ స్థానాన్ని ప్రాంతీయ పార్టీలు ఆక్రమిస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. ఈ సమయంలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గురించి చెప్పుకోవాలి. అప్పట్లో అటల్ బిహారీ వాజ్‌పేయీ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందారు. అయినా నెహ్రూ.. వాజ్‌పేయీని గౌరవించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర చాలా ముఖ్యమైంది. కాంగ్రెస్ బలంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓటములకు నిరాశ చెందకుండా కాంగ్రెస్ సిద్ధాంతాలను పాటించేవారు అందులోనే పనిచేయాలి. ఇప్పుడు ఓటమి ఎదురైన చోటే విజయం కూడా ఉంటుంది. అప్పట్లో భాజపా రెండు పార్లమెంట్ స్థానాలే గెలుచుకుంది. కానీ పార్టీ కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా కృషి చేశారు. ఆ ఫలితమే వాజ్‌పేయీ ప్రధాని అయ్యారు. నిరాశ నిస్పృహలతో మన సిద్ధాంతాలను వదులుకోకూడదు’ అంటూ మాట్లాడారు.

గడ్కరీ మాటల్ని స్వాగతిస్తాం.. కానీ:

కేంద్రమంత్రి గడ్కరీ చేసిన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ అన్నారు. అయితే ప్రతిపక్షాలను అణచివేసేందుకు భాజపా చేస్తోన్న ప్రయత్నాలపై ఆయన ప్రధాని మోదీతో మాట్లాడాలని సూచించారు. ‘ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా నిస్సహాయంగా కనిపిస్తోంది. భాజపాయేతర పార్టీలను వేధించేందుకు మీరు దర్యాప్తు సంస్థల్ని ఉపయోగిస్తున్నారు. గత ఎనిమిది సంవత్సరాల నుంచే ఈ తీరు కనిపిస్తోంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను నియంతృత్వంగా మార్చే తీరుపై గడ్కరీజీ ప్రధానితో మాట్లాడితే.. అది ప్రజాస్వామ్యానికి, దేశానికి మేలు చేస్తుంది’ అని కౌంటర్ ఇచ్చారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్.. అప్పటినుంచి తన వైభవాన్ని కోల్పోతూ వస్తోంది. వరుస పరాజయాలు మూటగట్టుకుంటోంది. భాజపాతో సహా ప్రాంతీయ పార్టీల నుంచి ఎదురవుతోన్న గట్టి పోటీకి నిలువలేకపోతోంది. ఇప్పుడు ఆ పార్టీ అధికారం రెండు రాష్ట్రాలకే పరిమితమైంది. మరికొన్ని చోట్ల సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగమైంది. పార్టీ వర్గాలకు మార్గనిర్దేశం చేసే, నాయకత్వం లేకపోవడమే ఈ పరిస్థితి కారణమనే విమర్శలున్నాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles