24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘మెట్రో’ సూపర్‌ సేవర్‌ ఆఫర్… ఈ కార్డ్‌తో మెట్రో రైలులో ఎన్నిసార్లైనా తిరగొచ్చు!

హైదరాబాద్:  మెట్రో రైలు సంస్థ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ రైలులో సూపర్‌ సేవర్‌ ఆఫర్‌ నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఉగాది కావడంతో ఇవాళ, రేపు ఆఫర్ వర్తించనుంది. రూ.59 ధర చెల్లించి ఒక రోజులో ఎక్కడి నుంచి మరెక్కడికైనా ఎన్నిసార్లైనా తిరిగే వెసులుబాటు కల్పించింది. అయితే అన్ని రోజుల్లో ఈ ఆఫర్ వర్తించదు. కొన్ని నిర్దేశిత సెలవు రోజుల్లో మైట్రో ప్రయాణికులు ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చునని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ స్పష్టం చేసింది. ‘సూపర్ సేవర్‌ కార్డు’ పేరుతో ఆఫర్ నేటి (ఏప్రిల్ 2) నుంచి వర్తిస్తుందని ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి ప్రకటించారు. ఈ సూపర్ సేవర్‌ కార్డును గురువారం ప్రారంభించగా, ఉగాది నుంచి మెట్రో రైలు ఆఫర్ అమలులోకి రానుందని తెలిపారు.
సెలవు రోజులు ఇవే..
ప్రిల్ 2వ తేదీ నుంచి ఈ కార్డుతో నిర్దేశిత సెలవుల్లో కేవలం రూ.59 చెల్లించి రోజంతా హైదరాబాద్ మెట్రో రైలులో నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా ప్రయాణించవచ్చు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లోనే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని వివరించారు. ప్రతి నెలలో ఆదివారం, రెండో, నాలుగో శనివారాలను సెలవు రోజులుగా పేర్కొంది.
రెగ్యూలర్ సెలవుదినాలతో పాటుగా పండుగ రోజులైన ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, డిసెంబరు 26 బాక్సింగ్ డే, బోగీ, సంక్రాంతి, శివరాత్రి రోజుల్లో రూ.59 మెట్రో ఆఫర్‌ వర్తిస్తుందని కేవీబీ రెడ్డి స్పష్టం చేశారు. ఏ రోజైతే టాపప్ లేదా కార్డ్ రీఛార్జ్ చేస్తారో అదే రోజు మాత్రమే వర్తిస్తుంది. మరో సెలవు రోజు తక్కువ ఖర్చుతో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించాలంటే ఆ నిర్దేశిత సెలవు రోజు కూడా నగదు చెల్లించి ఉంటుందని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.
సెలవు రోజులను మెట్రో స్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద క్యూఆర్ కోడ్  స్కాన్ చేసి వివరాలు పొందవచ్చు. లేదా టీ సవారీ యాప్ (T-Savari app) లేదా హైదరాబాద్ మెట్రో వెబ్ సైట్లో సెలవురోజుల వివరాలు ప్రయాణికులు పొందవచ్చు. ‘సూపర్ సేవర్‌ కార్డు’ (Super Saver Card)ను కేవలం కొనుగోలుదారుడు మాత్రమే వినియోగించుకోవాలి. ఈ కార్డును ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేయకూడదని చెప్పారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles