26.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

క్యూఎస్ వరల్డ్ సబ్జెక్ట్‌ ర్యాంకింగ్స్‌లో హెచ్‌సీయూ సత్తా!

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సబ్జెక్ట్ ర్యాంకింగ్స్-2022లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సత్తా చాటింది. బుధవారం విడుదల చేసిన క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ సబ్జెక్ట్ ర్యాంకింగ్స్ 2022లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యుఓహెచ్) టాప్ స్లాట్‌లలో కొనసాగుతోంది.  హెచ్సీయూలోని ఆర్ట్స్-హ్యుమానిటీస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, లైఫ్సైన్సెస్ అండ్ మెడిసిన్, నాచురల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ట్ అండ్ మేనేజ్మెంట్ వంటి 5 విభాగాల పరిధిలో 36 సబ్జెక్టులు ర్యాంకుల కోసం పోటీ పడ్డాయి. ఇందులో వర్సిటీలోని ఆంగ్ల, రసాయనశాస్త్ర, లైఫ్ సైన్సెస్ భౌతికశాస్త్రం విభాగాలు ర్యాంకులు దక్కించుకున్నాయి.
హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, హెచ్‌సీయూ అధ్యాపకులు సమర్పించిన పేపర్స్‌ను అన్ని అగ్రశ్రేణి జర్నల్స్‌లో ప్రచురించారు. హెచ్‌సీయూ ఐదు విస్తృత సబ్జెక్ట్ ఏరియాల మొత్తం 36 సబ్జెక్ట్‌లలో పోటీపడింది. ఆర్ట్స్ & హ్యుమానిటీస్, ఇంజినీరింగ్ & టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ & మెడిసిన్, నేచురల్ సైన్సెస్ మరియు సోషల్ సైన్సెస్ & మేనేజ్‌మెంట్ ర్యాంకింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. ఈ సంవత్సరం ర్యాంకింగ్ ప్రపంచవ్యాప్తంగా 161 ప్రాంతాలనుంచి 1,543 విశ్వవిద్యాలయాలు పోటీపడ్డాయి. మొత్తం 51 సబ్జెక్టులకు ర్యాంకింగ్‌లను క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ విశ్లేషించి ప్రచురించింది.
ఈ సంవత్సరం ఐదు అంశాల ఆధారంగా ప్రతి విశ్వవిద్యాలయానికి ర్యాంకులు కేటాయించారు.  ర్యాంకుల కేటాయింపులో అకడమిక్ కార్యకలాపాలు, పారిశ్రామికవర్గాల్లో గుర్తింపు, పరిశోధన సైటేషన్స్, హెచ్-ఇండెక్స్, అంతర్జాతీయ పరిశోధన కార్యకలాపాలు వంటి ఐదు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ర్యాంకులు కేటాయించింది.
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సబ్జెక్ట్ ర్యాంకింగ్స్-2022లో సత్తా చాటడంపై… హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్ బి.జె.రావు మాట్లాడుతూ…  “ఇంగ్లీష్, కెమిస్ట్రీ ఈ రెండు విభాగాలు ఇప్పటికే టాప్ 500 ర్యాంకుల్లోకి ప్రవేశించి నందుకు సంతోషిస్తున్నాను. లైఫ్ సైన్సెస్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో కొద్దిగా వెనకబడ్డాము. మేము 2021 నుండి ఈ విభాగాల్లో వెనుకంజలోనే ఉన్నాము. ఇది కొంత ఆందోళన కలిగించే విషయం. ర్యాంకింగ్స్‌లో పైకి వచ్చేలా చేయడానికి అధ్యాపకులు/పరిశోధకుల నుండి మెరుగైన ప్రచురణలను మేము ఎంపిక చేయాల్సి ఉంది. ఈ లోటును తీర్చడానికి కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంటామని వైస్ ఛాన్సలర్ చెప్పారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles