31 C
Hyderabad
Tuesday, October 1, 2024

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడటం ఖాయం… మమతాబెనర్జీ జోస్యం!

పురులియా/ బెంగాల్:  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. బీజేపీ పార్టీని, 2024 ఎన్నికలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ పురూలియాలో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం జాతీయ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని ఆరోపించారు. వచ్చే 2024 ఎన్నికల్లో బీజేపీ గెలవబోదని జోస్యం చెప్పారు.

కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ను ‘కల్తీ’గా అభివర్ణించారు. నోట్ల రద్దు, కేంద్ర ఎజెన్సీలతో ప్రతిపక్షాలపై దాడులు చేయడం వంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని దీదీ మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ‘ నో ఎం ఉంటుదని ఆమె అన్నారు. నోట్ల రద్దు వంటి వినాశకరమైన నిర్ణయాలు తీసుకుని దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసిందిని.. ఇది పెద్ద కుంభకోణం అని ఆరోపించారు.

బెంగాల్ లో అభివృద్ధి ప్రాజెక్టులు నెమ్మదిగా సాగడానికి కారణం కేంద్రం, బెంగాల్ కు కేంద్ర బాకాయిలు ఇప్పకపోవడమే అని ఆరోపించారు. దీని కోసం కింది స్థాయి నుంచి ఆందోళలు రావాలని.. స్థానిక బీజేపీ నేతలపై ఒత్తిడి పెంచాలని.. అప్పు కేంద్రం నుంచి నిధులు వస్తాయిని ఆమె పిలుపునిచ్చారు. దేశంలోని పౌరులు కేంద్రంలోని ప్రజావ్యతిరేఖ ప్రభుత్వంతో విసిగిపోయారని అన్నారు. 2024లో బీజేపీకి అవకాశం ఉండదని స్పష్టంగా చెబుతున్నానని.. బీజేపీ వెళ్లిపోవాల్సిందే అని.. మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని మమతా బెనర్జీ అన్నారు.

బిజెపికి వ్యతిరేకంగా ఆమె దాడిని కొనసాగిస్తూ, “బొగ్గు దోపిడీ, పశువుల స్మగ్లింగ్ స్కామ్‌లో వారు నిరపరాధులను విచారణ నిమిత్తం పిలుస్తున్నారు. కానీ బొగ్గు మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. ‘‘అంతర్జాతీయ సరిహద్దుల గుండా పశువులను ఎలా అక్రమ రవాణా చేస్తారు? బొగ్గు దోపిడీ కుంభకోణంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో సహా ఈ రెండు కుంభకోణాల్లో పలువురు టీఎంసీ నాయకులను కేంద్ర ఏజెన్సీలు పిలిపించడాన్ని ఆమె దుయ్యబట్టారు.

అలాగే రాష్ట్రానికి బకాయిపడిన ఉపాధిహామీ నిధులను చెల్లిచండంలో కేంద్రం చూపుతున్న వివక్షకు నిరసనగా జూన్ 5, 6 తేదీలలో రాష్ట్రంలోని వివిధ బ్లాక్‌లలో నిరసనలు నిర్వహించనున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. “కేంద్రం మా నిధులు విడుదల చేయాల్సిందే… లేకుంటే గద్దె దిగండి. మీరు రాష్ట్రాలకు డబ్బు చెల్లించలేకపోతే, ఈ దేశాన్ని పాలించే హక్కు మీకు లేదు, ఇటువంటి వివక్షత విధానాలకు వ్యతిరేకంగా మేము నిరసనలు నిర్వహిస్తాము” అని దీదీ అన్నారు. గత కొన్నేళ్లుగా పురులియాలో బిజెపి ప్రాబల్యం సంపాదించింది, అయితే వెనుకబడిన పురూలియా జిల్లా కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. దీంతో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం లేదా టిఎంసిపై ఇకపై కోపంతో లేరని బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు.

“అజోధ్య హిల్స్ నుండి బాగ్ముండి వరకు, మేము ₹ 72,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టాం. రఘునాథ్‌పూర్‌లో వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి, మహిళలకు కూడా ఉపాధి లభిస్తుంది” అని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో త్వరలో కొత్త ఫిల్మ్ సిటీ, విమానాశ్రయం రాబోతుందని మమతా బెనర్జీ అన్నారు.

ఒకప్పుడు లెఫ్ట్ ఫ్రంట్‌కు బలమైన కోటగా పరిగణించబడిన పురూలియాను 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ చేజిక్కించుకుంది. కానీ కాషాయ శిబిరం ఆ ప్రాంతంలో పుంజుకుంది. 2019 లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుంది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఆరు బీజేపీ, మూడు తృణమూల్ గెలుపొందాయి.

కాగా, సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య స్పందిస్తూ, కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. “2019లో కూడా ఆమె బిజెపి తిరిగి అధికారంలోకి రాదని చెప్పారు. ఫలితాలను చూశాము. 2024లో బిజెపి వరుసగా మూడవసారి అధికారంలోకి వస్తుందని ఆయన తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles