23.7 C
Hyderabad
Monday, September 30, 2024

బీజేపీ కారణంగా భారత దేశం ప్రతిష్ట దిగజారింది: ఉద్ధవ్ ఠాక్రే!

ఔరంగాబాద్‌: బీజేపీ నేతలు ప్రవక్త ముహమ్మద్‌ (సఅ)పై వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా గల్ఫ్‌ దేశాలకు ‘మోకాళ్లపైకి వంగి క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని’ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం అన్నారు. ఈ వ్యాఖ్యల కారణంగా దేశం అంతర్జాతీయ స్థాయిలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఠాక్రే అన్నారు. గత ఏడాది నవంబర్‌లో తన వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత ముంబై వెలుపల ఏర్పాటు చేసిన మొదటి ర్యాలీని ఉద్దేశించి మాట్లాడటం ఇదే మొదటిసారి. ఓవైపు ద్రవ్యోల్బణం పెరుగుతోంది., రూపాయి క్షీణిస్తోంది. ఈపరిస్థితుల్లో ముఖ్యమైన అంశాలను వదిలేసి ఏ మసీదు కింద శివలింగం ఉందో వెతుకుతున్నారని బిజెపిపై మాటల దాడి చేశారు.

కశ్మీర్‌లో ఇటీవల జరిగిన హత్యలపై ఆయన కేంద్రాన్ని చురకలంటించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ద్వారా మహారాష్ట్ర పాలక మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) నాయకులను వేధించే బదులు కశ్మీర్‌లో వేర్పాటువాదులపై దాడులు నిర్వహించాలని అన్నారు. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ.. ‘మధ్య ప్రాచ్యం, అరబ్ దేశాలు మన దేశాన్ని మోకాళ్లపైకి తెచ్చి క్షమాపణలు చెప్పించారు. దీనికి కారకులెవరు? భారతదేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి. . దేశం ఏమి చేసింది? ఆ నేరం చేసింది బీజేపీ,దాని అధికార ప్రతినిధులే.”

‘బీజేపీ అధికార ప్రతినిధి లేదా బీజేపీ మాట్లాడే మాటలు ఏ సమస్యపైనా భారతదేశ వైఖరిని ప్రతిబింబించవు. మహ్మద్ ప్రవక్త పై బీజేపీ అధికార ప్రతినిధి ఉపయోగించిన మాటలు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను దిగజార్చాయని మహారాష్ట్ర సీఎం అన్నారు.

‘‘మాకు (శివసేన, బీజేపీ) మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి కానీ ఆయన (నరేంద్ర మోదీ) మన దేశ ప్రధాని. ఆయన ఫొటో చెత్త కుండీలపై (ఏదో దేశంలో) తగిలించడం మనం చూస్తూనే ఉన్నాం.. అయితే దేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలి? బీజేపీ, దాని అధికార ప్రతినిధి తప్పుల కారణంగా ఇలా జరుగుతుంది” అని థాకరే పేర్కొన్నారు.

ప్రవక్త మొహమ్మద్‌పై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై కొన్ని ముస్లిం దేశాల నిరసనలతో వివాదం పెరగడంతో బిజెపి ఆదివారం నూపుర్ శర్మను సస్పెండ్ చేసింది. ఢిల్లీ మీడియా ఇన్‌చార్జ్‌ నవీన్ కుమార్ జిందాల్‌ను బహిష్కరించింది.

ఇటీవల టీవీ చర్చలో శ్రీమతి నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు… జిందాల్ ఇప్పుడు తొలగించిన ట్వీట్లు… కొన్ని గల్ఫ్ దేశాలలో భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చేతి ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ అయ్యాయి. బిజెపి ప్రవర్తనను మీరు ఊహించారా అని నేను ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్‌ను అడగాలనుకుంటున్నాను” అని థాకరే అన్నారు.

హిందుత్వం, ద్రవ్యోల్బణం, బిజెపి అధికార ప్రతినిధుల వివాదాస్పద ప్రకటనలు ఇలా పలు అంశాలపై సీఎం ఠాక్రే బిజెపిని లక్ష్యంగా చేసుకున్నారు. హిందుత్వాన్ని విడిచిపెట్టామని చెప్పుకోవడానికి మేం ఏం చేశాం.. హిందుత్వ కోసం శివసేన ఏం చేసిందో, బీజేపీ ఏం చేసిందో చర్చిద్దాం అని ఆయన అన్నారు.

సీఎం ఠాక్రే వ్యక్తిగత నివాసం ‘మాతోశ్రీ’ వెలుపల హనుమాన్ చాలీసా పఠించాలని పట్టుబట్టి అరెస్టైన స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా దంపతులపైనా ఠాక్రే విరుచుకుపడ్డారు. దమ్ముంటే కాశ్మీర్‌కు వెళ్లి హనుమాన్ చాలీసా చదవండి.. కాశ్మీర్ పండిట్‌లను రక్షించండి.. దమ్ముంటే అక్కడికి వెళ్లండి’’ అని అని సవాల్‌ విసిరారు. “కాశ్మీరీ పండిట్లు లోయను విడిచిపెట్టడం ఎవరికైనా కోపం తెప్పిస్తుంది, వారి కోసం ఎవరూ మాట్లాడటానికి సిద్ధంగా లేరు. బిజెపికి చెందిన ఒక్క అధికార ప్రతినిధి అయినా ఈ అంశంపై మాట్లాడారా” అని ఆయన ప్రశ్నించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles